Nursing Colleges: అడ్మిషన్ల ప్రక్రియ వేగవంతం చేయండి: దామోదర
ABN , Publish Date - Nov 03 , 2024 | 04:24 AM
రాష్ట్రంలో వైద్యకళాశాలలకు అనుబంధంగా ఏర్పాటైన 15 నర్సింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాఽధికారులను ఆదేశించారు. శనివారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో నర్సింగ్ కాలేజీలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైద్యకళాశాలలకు అనుబంధంగా ఏర్పాటైన 15 నర్సింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాఽధికారులను ఆదేశించారు. శనివారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో నర్సింగ్ కాలేజీలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా... జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, కొడంగల్, ఆసిఫాబాద్, మెదక్, కుత్భుల్లాపూర్, ములుగు, నారాయణపేట, నిర్మల్, రామగుండం, మహేశ్వరం, నర్సంపేట, యాదాద్రిలో ఏర్పాటు చేసిన నర్సింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియతో పాటు వాటిలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి అయిన వెంటనే తరగతులను ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమీక్షలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.