Share News

Dengue fever: డెంగీ జ్వరం.. జరభద్రం

ABN , Publish Date - Jul 30 , 2024 | 11:39 AM

వానాకాలం కావడంతో చెత్తాచెదారం, ఇతర వ్యర్థాల వల్ల దోమలు విజృంభిస్తున్నాయి. ఫలితంగా డెంగీ, మలేరియా(Dengue, Malaria) బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. డెంగీ అనేది వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌(Viral infection) అని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

Dengue fever: డెంగీ జ్వరం.. జరభద్రం

హైదరాబాద్‌ సిటీ: వానాకాలం కావడంతో చెత్తాచెదారం, ఇతర వ్యర్థాల వల్ల దోమలు విజృంభిస్తున్నాయి. ఫలితంగా డెంగీ, మలేరియా(Dengue, Malaria) బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. డెంగీ అనేది వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌(Viral infection) అని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా దోమ కుట్టిన 4 నుంచి 10రోజుల తర్వాత జ్వర లక్షణాలు ప్రారంభమవుతాయని పేర్కొంటున్నారు. జ్వరం వచ్చిన కొన్ని రోజుల తర్వాత శరీరంపై దురద కనిపించవచ్చన్నారు. తీవ్రమైన సందర్భాల్లో డెంగీ షాక్‌ సిండ్రోమ్‌గా వృద్ధిచెందుతుందని, ఇది ప్రాణాంతకం కావొచ్చని అపోలో క్రెడిల్‌, చిల్డ్రన్స్‌ ఆస్పత్రి వైద్యుడు అవష్‌ పాణి తెలిపారు.

ఇదికూడా చదవండి: Rachakonda: సైకిల్‌పై గస్తీ.. ప్రజలతో దోస్తీ


జ్వరంతో తేలికపాటి లక్షణాలు

అత్యధిక మంది రోగులు సాధారణంగా ఏదైనా వైరల్‌ జ్వరం(Viral fever)తో తేలికపాటి లక్షణాలతో ఉంటారన్నారు. డెంగీ జ్వరం లక్షణాలు, ప్రయాణ చరిత్ర, ఆ ప్రాంతంలో డెంగీ జ్వరం, ప్రయోగశాల పరీక్షల ఆధారంగా నిర్ధారణ చేయబడుతుందన్నారు. కొంతమంది రోగులకు సెలైన్‌ ఇన్ఫ్యూషన్‌ కోసం మాత్రమే ఆస్పత్రి అవసరం ఉంటుందన్నారు. ఆసుపత్రిలో చేరిన రోగులలో కొద్దిమందికి మాత్రమే డీహైడ్రేషన్‌ డెవలప్‌ చేయవచ్చన్నారు.

city4.2.jpg


ఇలా గుర్తించాలి

- డెంగీ విషయంలో జాగ్రత్త అవసరం. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

- సాధారణ లక్షణాలు, జ్వరం, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, దద్దుర్లు, తేలికపాటి రక్తస్రావం, ముక్కు లేదా గమ్‌ బ్లీడ్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి.

- పిల్లల్లో డెంగీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

- తీవ్రమైన పొత్తి కడుపు నొప్పి, వాం తులు, వేగవంతమైన శ్వాస, చిగుళ్లలో రక్తస్రావం, అలసట, విశ్రాంతి లేకపోవడం వంటివి కనిపిస్తే తీవ్రమైన డెంగీ హెచ్చరిక సంకేతాలుగా భావించాలి.


ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 30 , 2024 | 11:39 AM