Share News

Khammam: బీజేపీ, బీఆర్‌ఎస్‌, అవినీతి పార్టీలు..

ABN , Publish Date - Apr 30 , 2024 | 05:50 AM

దేశంలో అతిపెద్ద అవినీతి పార్టీలుగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు గుర్తింపు పొందాయని, ఎన్నికల బాండ్ల పేరుతో జరిగిన అవినీతిలోనే ఇది రుజువైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,

Khammam: బీజేపీ, బీఆర్‌ఎస్‌, అవినీతి పార్టీలు..

  • ఎన్నికల బాండ్లలోనే ఆ అంశం రుజువైంది

  • సిగ్గు లేకుండా కేసీఆర్‌ బస్సుయాత్ర చేస్తుండు

  • భారీ మెజారిటీతో ఖమ్మం అభ్యర్థిని గెలిపిస్తాం

  • డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి

ఖమ్మం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దేశంలో అతిపెద్ద అవినీతి పార్టీలుగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు గుర్తింపు పొందాయని, ఎన్నికల బాండ్ల పేరుతో జరిగిన అవినీతిలోనే ఇది రుజువైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలతో సోమవారం వారు సమావేశమయ్యారు.


అనంతరం విలేకరుల సమావేశలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ కొత్తగూడెం సభలో కాంగ్రెస్‌ అవినీతి పార్టీ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గత పదేళ్లలో దేశ సంపదను మోదీ, రాష్ట్ర సంపదను కేసీఆర్‌ దోచుకున్నారన్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టబోతున్నారన్నారు. అధికారం కోల్పోయిన కేసీఆర్‌ నాలుగు నెలలకే ఆగలేకపోతున్నారని, సిగ్గు లేకుండా బస్సు యాత్రలు చేస్తున్నాడని దుయ్యబట్టారు.


వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోతే.. అది కాంగ్రెస్‌ వల్లేనని విమర్శించడం అవివేకమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ 15 లోక్‌సభ స్థానాలు గెలుస్తుందని, అందులో ఖమ్మం స్థానాన్ని అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌ పక్షాన నిలిచి రేవంత్‌రెడ్డిని సీఎంను చేసుకున్నారన్నారు.

అలాగే లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రె్‌సకు మద్దతుగా నిలిచి రాహుల్‌గాంధీని ప్రధానిని చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 4న కొత్తగూడెంలో సీఎం రేవంత్‌రెడ్డి సభ ఉంటుందని, దానిని జయప్రదం చేయాలని కోరారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌ ఏ మొహంతో ప్రజల వద్దకు వస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రె్‌సకు అనుకూల పవనాలున్నాయన్నారు. దేశంలోనూ ‘ఇండియా’ కూటమికి ప్రజలు మద్దతు పలుకుతున్నారని తెలిపారు.

Updated Date - Apr 30 , 2024 | 05:50 AM