Share News

Khammam : ‘దళితబంధు’ విక్రేతలపై కేసులు: భట్టి

ABN , Publish Date - Aug 04 , 2024 | 03:39 AM

దళితబంధు యూనిట్ల క్రయవిక్రయదారులపై కేసులు నమోదు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

Khammam : ‘దళితబంధు’ విక్రేతలపై కేసులు: భట్టి

  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

చింతకాని, ఆగస్టు 3: దళితబంధు యూనిట్ల క్రయవిక్రయదారులపై కేసులు నమోదు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా చింతకానిలో శనివారం దళితబంధు పథకంపై గ్రామాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల ఆర్థికాభివృద్ధి కోసం చేపట్టిన దళితబంధు పథకం లక్ష్యం నెరవేరాలన్నారు.


లబ్ధిదారులు తమ యూనిట్‌ను విక్రయిస్తే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పర్యటించి పూర్తి వివరాలు సేకరించాలని, లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులుపై నివేదిక రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో ఖమ్మం కలెక్టర్‌ ఎండీ ముజమ్మిల్‌ఖాన్‌, హస్తకళల కార్పొరేషన్‌ చైర్మన్‌ నాయుడు సత్యనారాయణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2024 | 03:39 AM