Share News

Deputy CM: విద్యుత్‌ వ్యవస్థ బలోపేతానికి చర్యలు..

ABN , Publish Date - Aug 09 , 2024 | 09:35 AM

గ్రేటర్‌లో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ వ్యవస్థను బలోపేతం చేస్తూ, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం, విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Minister Bhatti Vikramarka) తెలిపారు.

Deputy CM: విద్యుత్‌ వ్యవస్థ బలోపేతానికి చర్యలు..

- రాబోయే ఐదేళ్లలో గ్రేటర్‌లో 10వేల మెగావాట్ల డిమాండ్‌

- విద్యుత్‌శాఖ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ వ్యవస్థను బలోపేతం చేస్తూ, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం, విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Minister Bhatti Vikramarka) తెలిపారు. ఖైరతాబాద్‌లోని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం గ్రేటర్‌ పరిధిలో మాన్‌సూన్‌ సీజన్‌లో నిరంతర సరఫరాకు సంస్థ చేస్తున్న ఏర్పాట్లు, ఫీడర్‌ సర్వే కోసం రూపొందించిన టీజీఎయిమ్స్‌ మొబైల్‌ యాప్‌, విద్యుత్‌ సమస్యలు, భవిష్యత్‌ డిమాండ్‌పై సమీక్ష నిర్వహించారు. గ్రేటర్‌ పరిధిలోని విద్యుత్‌ వ్యవస్థ పనితీరుపై మొదటిసారి డిప్యూటీ సీఎం మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్‌ జోన్ల పరిధిలోని సీఈ, ఎస్‌ఈలతో పాటు డీఈ, ఏడీఈలతో నేరుగా మాట్లాడారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఐటీ కంపెనీల భవనాలకు హై రైజ్‌ కెమెరాలు..


ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ రాబోయే ఐదేళ్లలో గ్రేటర్‌జోన్‌ విద్యుత్‌ డిమాండ్‌ 10వేల మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నామన్నారు. భవిష్యత్‌ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్త సబ్‌స్టేషన్లు, విద్యుత్‌లైన్లు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. త్వరలో బౌరంపేటలో 220 కేవీ సబ్‌స్టేషన్‌ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో విద్యుత్‌సరఫరాలో ఎక్కడా అంతరాయాలు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. యాజమాన్యం స్థాయిలో నిర్ణయం తీసుకొని వెంటనే ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని సీఎండీలను ఆయన ఆదేశించారు.


ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి..

1912 టోల్‌ ఫ్రీ నంబర్‌తో పాటు విద్యుత్‌ కార్యాలయానికి వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే అధికారులు, సిబ్బంది స్పందించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఫీడర్‌ సర్వే కోసం రూపొందించిన టీజీఎయిమ్స్‌ మొబైల్‌ యాప్‌ పనితీరును టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫారుఖి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. సమీక్షలో మెట్రోజోన్‌ సీఈ నర్సింహస్వామి, రంగారెడ్డి జోన్‌ సీజీ పి.ఆనంద్‌, మేడ్చల్‌ జోన్‌ సీఈ సాయిబాబా, 10 సర్కిళ్ల ఎస్‌ఈలు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 09 , 2024 | 09:35 AM