Pension: వికలాంగుల పింఛన్ రూ.6 వేలు చేయాలి
ABN , Publish Date - Nov 25 , 2024 | 03:56 AM
వికలాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచి, అందించాలని ప్రభుత్వాన్ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది.
నేడు జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక వెల్లడి
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): వికలాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచి, అందించాలని ప్రభుత్వాన్ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ విషయమై సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఽధర్నాలు నిర్వహిస్తున్నట్టు కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచి, అమలు చేస్తామని హామినిచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్నా ఇప్పటికీ పింఛన్‌ను పెంచలేదని ఆయన పేర్కొన్నారు.