Share News

Diwali 2024: మార్కెట్లకు దీపావళి శోభ..

ABN , Publish Date - Oct 30 , 2024 | 10:25 AM

రకరకాల బొమ్మలు, ప్రమిదలు, మిరమిట్లు గొలుపే విదుత్‌ దీపాల అమ్మకాలతో మల్కాజిగిరిలోని ప్రధాన కూడళ్లలో సందడి నెలకొంది. దీపావళి(Diwali) పండుగను పురస్కరించుకుని ఇంటిముందు పెట్టే మట్టితో వివిధ ఆకృతులతో తయారు చేసిన ప్రమిదలు, దీపావళి రోజున ఇళ్లలో నిర్వహించుకునే బొమ్మల కొలువుకు సంబంధించిన వివిధ రకాల బొమ్మల అమ్మకాలు మార్కెట్‌లో జోరుగా సాగుతున్నాయి.

Diwali 2024: మార్కెట్లకు దీపావళి శోభ..

- అమ్మకానికి సిద్ధంగా రకరకాల బొమ్మలు, ప్రమిదలు

- ప్రధాన కూడళ్లలో కొనుగోలుదారుల సందడి

హైదరాబాద్: రకరకాల బొమ్మలు, ప్రమిదలు, మిరమిట్లు గొలుపే విదుత్‌ దీపాల అమ్మకాలతో మల్కాజిగిరిలోని ప్రధాన కూడళ్లలో సందడి నెలకొంది. దీపావళి(Diwali) పండుగను పురస్కరించుకుని ఇంటిముందు పెట్టే మట్టితో వివిధ ఆకృతులతో తయారు చేసిన ప్రమిదలు, దీపావళి రోజున ఇళ్లలో నిర్వహించుకునే బొమ్మల కొలువుకు సంబంధించిన వివిధ రకాల బొమ్మల అమ్మకాలు మార్కెట్‌లో జోరుగా సాగుతున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: MLA: డబ్బులకు పోస్టింగ్‌లు ఇప్పించుడే ఆయన పని..


city4.2.jpg

గుజరాత్‌, రాజస్థాన్‌(Gujarat, Rajasthan)కు చెందిన కళాకారులు తయారుచేసిన ప్రమిదలు, బొమ్మలు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. గుజరాత్‌, రాజస్థాన్‌ నుంచి బొమ్మలను దిగుమితి చేసుకున్న వ్యాపారులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాటి విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు. మల్కాజిగిరి, లాలాగూడ, తార్నాక(Malkajigiri, Lalaguda, Tarnaka)తో పాటు తార్నాక నుంచి హబ్సిగూడ, ఉప్పల్‌ వెల్లే ప్రధాన రహదారికి ఇరువైపులా వీటి అమ్మకందారులు, కొనుగోలుదారులతో సందడి నెలకొంది.


అల్వాల్‌, మచ్చబొల్లారంలో..

అల్వాల్‌: అల్వాల్‌, మచ్చబొల్లారం మార్కెట్‌, వెంకటాపురం ప్రధాన చౌరస్తాల వద్ద రోడ్ల పక్కన పెద్ద సంఖ్యలో దుకాణాలు కొలువు దీరాయి. రూ. 25 నుంచి వేల రూపాయల విలువైన బొమ్మలు, దీపాల విక్రయాలు సాగించారు. దేవతల విగ్రహాలు, పక్షులు, జంతువులు, పూల మొక్కలతో పాటు వివిధ రకాల ప్రతిమలను విక్రయించారు. ఆకట్టుకునే దీపాలనూ అమ్మకాలకు ఉంచారు.


city4.jpg

తెలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్‌, మహారాష్ట్రకు చెందిన విక్రయదారులు తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేశారు. అందుబాటు ధరల్లో లభించడంతో ఆ దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి. అల్వాల్‌, లోతుకుంట, హెచ్‌ఎంటీ కాలనీ, టీఆర్‌కే రెడ్డి ఎన్‌క్లేవ్‌ తదితర ప్రాంతాలకు చెందిన వినియోగదారులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపారు. రోడ్డు పక్కాన కార్లు, ద్విచక్రవాహనాలు బారులుదిరాయి. పరిసర ప్రాంతాలన్నీ జాతరను తలపించాయి.


ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మట్టి రోడ్డు లేకుండా చేస్తాం

ఈవార్తను కూడా చదవండి: యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌కు 7,037 కోట్ల అదనపు రుణం

ఈవార్తను కూడా చదవండి: KTR : కాంగ్రెస్‌ దాడులను ఎదుర్కొందాం

ఈవార్తను కూడా చదవండి: టీజీఎస్పీ పోలీసుల వైఖరిపై నిఘా

Read Latest Telangana News and National News

Updated Date - Oct 30 , 2024 | 10:31 AM