Diwali: సదర్ ఉత్సవాలకు దున్నలు సిద్ధం..
ABN , Publish Date - Oct 29 , 2024 | 10:29 AM
దీపావళి(Diwali) పర్వదినం సందర్భంగా యాదవులు నగరంలో నిర్వహించే సదర్ ఉత్సవాల్లో హరియాణా, గుజరాత్(Haryana, Gujarat) రాష్ర్టాలకు చెందిన భారీ దున్నలు సదర్‌లో అలరించనున్నాయి. నవంబర్ 2న నగరంలో నిర్వహించే సదర్ ఉత్సవాల్లో దున్నలు పాల్గొనే విధంగా ముషీరాబాద్‌కు చెందిన అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీఆర్‌ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల హరిబాబుయాదవ్, హరియాణా రాష్ట్రం నుంచి ప్రత్యేక వాహనంలో ఏడేళ్ల వయస్సున్న భారీ దున్న (గోలు) షేర్ (8 ఏండ్లు), గుజరాత్‌కు చెందిన శ్రీకృష్ణ (7 ఏండ్లు), విదాయక్ (8 ఏండ్లు) దున్నలను తీసుకొచ్చారు.
- హరియాణ, గుజరాత్ నుంచి నగరానికి..
- సందడి చేయనున్న నేషనల్ చాంపియన్ దున్నలు
హైదరాబాద్: దీపావళి(Diwali) పర్వదినం సందర్భంగా యాదవులు నగరంలో నిర్వహించే సదర్ ఉత్సవాల్లో హరియాణా, గుజరాత్(Haryana, Gujarat) రాష్ర్టాలకు చెందిన భారీ దున్నలు సదర్‌లో అలరించనున్నాయి. నవంబర్ 2న నగరంలో నిర్వహించే సదర్ ఉత్సవాల్లో దున్నలు పాల్గొనే విధంగా ముషీరాబాద్‌కు చెందిన అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీఆర్‌ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల హరిబాబుయాదవ్, హరియాణా రాష్ట్రం నుంచి ప్రత్యేక వాహనంలో ఏడేళ్ల వయస్సున్న భారీ దున్న (గోలు) షేర్ (8 ఏండ్లు), గుజరాత్‌కు చెందిన శ్రీకృష్ణ (7 ఏండ్లు), విదాయక్ (8 ఏండ్లు) దున్నలను తీసుకొచ్చారు. ఈ దున్నలు భారీ ఆకారంలో ఉండడంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ‘మూసీ’ సుందరీకరణకు జేఏసీ ఏర్పాటు చేయండి
దున్నల ప్రత్యేకత
ఆరు అడుగుల ఎత్తు, 1800 కిలోల బరువు ముర్రా జాతికి చెందిన గోలు దున్నా నేషనల్ చాంపియన్‌షిప్ పశువుల ప్రదర్శనలో రెండు సార్లు విజేతగా నిలిచింది. 5 లక్షల అవార్డు సైతం పొందింది. దీని యజమాని నరేందర్‌సింగ్ ముర్రా జాతిని ప్రోత్సహిస్తూ ప్రత్యేకంగా పెంచడంతో ఆయనను అభినందిస్తూ రాష్ట్రపతి, ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) చేతులమీదుగా పద్మశ్రీ అవార్డును పొందారు. షేర్ దున్నా, గుజరాత్‌కు చెందిన శ్రీకృష్ణ దున్నా సైతం పశుమేళాలో బహుమతులను పొందాయి.
ఈ దున్నలకు రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు స్నానం చేయిస్తారు. 20 లీటర్ల పాలు తాగించడంతో పాటు యాపిల్స్, డ్రైఫ్రూట్స్, అరటిపండ్లు, బెల్లం, తదితర పండ్లను ఆహారంగా అందజేస్తారు.
సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సదరు ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించడం హర్షణీయమని మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబుయాదవ్ తెలిపారు. యాదవుల ఐక్యతకు, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. సదర్ కోసం హరియాణా, గుజరాత్‌ల నుంచి దున్నలను తెచ్చారు.
ఈవార్తను కూడా చదవండి: Food Poisoning: వామ్మో.. మోమోస్!
ఈవార్తను కూడా చదవండి: KTR: బుచ్చమ్మది.. రేవంత్ చేసిన హత్య
ఈవార్తను కూడా చదవండి: Madhuranagar: ‘ధరణి’తో మా ప్లాట్ల కబ్జా
ఈవార్తను కూడా చదవండి: Kaleshwaram Project: మేడిగడ్డతో ముంపు
Read Latest Telangana News and National News