Share News

Hyderabad: ఏపీ, తెలంగాణలో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్‌లకు బిగ్ షాక్..

ABN , Publish Date - Oct 10 , 2024 | 07:10 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పని చేస్తున్న అఖిల భారత సర్వీస్ అధికారులకు(IAS & IPS) కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ(DOPT) బిగ్ షాక్ ఇచ్చింది. కేడర్ మార్పు కోసం చేసుకున్న విజ్ఞప్తులను డీఓపీటీ తిరస్కరించింది. కేటాయించిన కేడర్ రాష్ట్రాల్లోనే ..

Hyderabad: ఏపీ, తెలంగాణలో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్‌లకు బిగ్ షాక్..
Andhra Pradesh and Telangana

హైదరాబాద్, అక్టోబర్ 10: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పని చేస్తున్న అఖిల భారత సర్వీస్ అధికారులకు(IAS & IPS) కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ(DOPT) బిగ్ షాక్ ఇచ్చింది. కేడర్ మార్పు కోసం చేసుకున్న విజ్ఞప్తులను డీఓపీటీ తిరస్కరించింది. కేటాయించిన కేడర్ రాష్ట్రాల్లోనే కొనసాగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది డీఓపీటీ.


తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారులు ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాణి ప్రసాద్, వాకాటి కరుణ, ఏం. ప్రశాంతి తదితరులకు రిలీవ్ ఆర్డర్ జారీ చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న తెలంగాణ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎస్‌ఎస్ రావత్, అనంత్ రాము, సృజన, శివశంకర్ లోతేటి లకు రిలీవ్ ఆర్డర్ జారీ చేసింది. తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిషేక్ మహంతి, అభిలాష బిస్త్‌లకు రిలీవ్ ఆర్డర్ ఇచ్చింది. ఏపీలో పని చేస్తున్న తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి సీహెచ్ హరి కిరణ్‌కు డీఓపీటీ రిలీవ్ ఆర్డర్స్ ఇచ్చింది. అక్టోబర్16వ తేదీ లోగా విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.


Also Read:

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల వారికి హైఅలర్ట్

అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

అక్టోబర్ 17 తరువాత ఈ రాశుల వారికి మహర్ధశ..

For More Telangana News and Telugu News..

Updated Date - Oct 10 , 2024 | 07:10 PM