Share News

Dr. Bhanuprakash Reddy: జాతీయ వ్యవసాయ అకాడమీ ఫెలోగా శాస్త్రవేత్త భానుప్రకాశ్‌ రెడ్డిజాతీయ వ్యవసాయ అకాడమీ ఫెలోగా శాస్త్రవేత్త భానుప్రకాశ్‌ రెడ్డి

ABN , Publish Date - Dec 28 , 2024 | 06:24 AM

జాతీయ వ్యవసాయ అకాడమీ(నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సైన్సెస్‌) ఫెలోగా జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) సీనియర్‌ శాస్త్రవేత్త, బయోకెమిస్ట్రీ విభాగం సారథి డాక్టర్‌ భానుప్రకాష్‌ రెడ్డి ఎంపికయ్యారు.

Dr. Bhanuprakash Reddy: జాతీయ వ్యవసాయ అకాడమీ ఫెలోగా శాస్త్రవేత్త భానుప్రకాశ్‌ రెడ్డిజాతీయ వ్యవసాయ అకాడమీ ఫెలోగా శాస్త్రవేత్త భానుప్రకాశ్‌ రెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 28: జాతీయ వ్యవసాయ అకాడమీ(నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సైన్సెస్‌) ఫెలోగా జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) సీనియర్‌ శాస్త్రవేత్త, బయోకెమిస్ట్రీ విభాగం సారథి డాక్టర్‌ భానుప్రకాష్‌ రెడ్డి ఎంపికయ్యారు. పోషకాహార రంగంలో భానుప్రకాష్‌ చేసిన విస్తృతపరిశోధనలకు గుర్తింపుగా ఆయనకు ఫెలోగా అవకాశం దక్కిందని ఎన్‌ఐఎన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. మనిషికి ఎంత పోషకాహారం కావాలి? పోషకాహార లోపాలు, నిత్యం ఉపయోగించే వంట దినుసులతో అనేక వ్యాధులను ఎలా దరిచేరకుండా చూసుకోవచ్చనే అంశాలపై భానుప్రకాష్‌ దశాబ్దాలుగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు.


వంట దినుసులతో మధుమేహాన్ని ఎలా దరిచేరకుండా చూసుకోవచ్చనే దానిపై విజయవంతంగా పరిశోధనలు నిర్వహించారు. జాతీయ, అంతర్జాతీయంగా 250 పరిశోధనా వ్యాసాలను ప్రచురించారు. ఐసీఎంఆర్‌-బసంతి దేవి అవార్డుతో పాటు పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను భానుప్రకాష్‌ అందుకున్నారు.

Updated Date - Dec 28 , 2024 | 06:24 AM