Share News

Duddilla Sridhar Babu: నైపుణ్య శిక్షణ..

ABN , Publish Date - Aug 29 , 2024 | 04:39 AM

వచ్చే నాలుగేళ్లలో 50 వేల మందికి నైపుణ్య శిక్షణ అందిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడించారు.

Duddilla Sridhar Babu: నైపుణ్య శిక్షణ..

  • నాలుగేళ్లలో 50 వేల మందికి..

  • ఎన్‌ఎస్‌ఐసీతో ఒప్పందం

  • మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి

హైదరాబాద్‌, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): వచ్చే నాలుగేళ్లలో 50 వేల మందికి నైపుణ్య శిక్షణ అందిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడించారు. సచివాలయంలో బుధవారం ఆయన జాతీయ చిన్న తరహా పరిశమ్రల కార్పొరేషన్‌ (ఎన్‌ఎ్‌సఐసీ)తో ఈ మేరకు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎన్‌ఎ్‌సఐసీ జాతీయ బ్యాంకుల నుంచి రుణాలను ఇప్పించడంలో దోహదపడుతుందని, చిన్న పరిశ్రమలు ముడిసరుకు కొనుగోలు, ఉత్పత్తుల విక్రయంలో సహకరిస్తుందని తెలిపారు.


జిల్లా స్థాయిలో ఈ సేవలను ఎక్కువగా వినియోగించుకోవడంపై దృష్టిసారిస్తామన్నారు. ఇందు కోసం (టీఈజేఏఎస్‌) తెలంగాణ ఎంట్రపెన్యూర్‌ జర్నీ ఫర్‌ యాస్పిరేషన్స్‌ అండ్‌ అచీవింగ్‌ సక్సెస్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సమావేశంలో ఎన్‌ఎ్‌సఐసీ ఛైర్మన్‌ సుభ్రాంశు శేఖర్‌ ఆచార్య, పరిశ్రమల శాఖ కమిషనర్‌ డా. మల్సూర్‌, టీ-వర్క్స్‌ సీఈవో జోగిందర్‌ తనికెళ్ల, తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ ఫౌండేషన్‌ సీఈవో శ్రీకాంత్‌ నాగప్ప పాల్గొన్నారు.


  • ఐటీ ఎగుమతుల్లో 11.3శాతం వృద్ధి

ఐటీ ఎగుమతుల్లో జాతీయ సగటు కంటే తెలంగాణ మూడింతల వృద్ధి సాధించిందని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. వచ్చే నెల 5,6 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గ్లోబల్‌ ఏఐ సదస్సుకు సన్నాహకంగా ‘నాస్కా మ్‌’ బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 2024-25 తొలి త్రైమాసికంలో జాతీయ ఐటీ ఎగుమతులు 3.3ుపెరిగాయని, అదే సమయంలో రాష్ట్రంలో 11.3ు వృద్ధి నమోదైందన్నారు. ఈ సందర్భంగా ‘ఏఐ అడాప్షన్‌ 2.0’ నివేదిక విడుదల చేశారు.

Updated Date - Aug 29 , 2024 | 04:39 AM