Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు.. రాలేనంటూ ఈడీకి లేఖ
ABN , Publish Date - Jan 15 , 2024 | 06:45 PM
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. దీంతో తెలంగాణలో రాజకీయాల్లో ఈ నోటీసులు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. మరింత ఆసక్తికరంగా మారాయి. అయితే.. కవిత విచారణకు వెళ్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
గతంలోనూ కవితను ఈడీ మూడు సార్లు విచారించింది. తాజాగా.. మరోసారి విచారణకు రావాలంటూ కవితకు నోటీసులు ఇచ్చినట్లు ఈడి వర్గాలు ధ్రువీకరించాయి.
లిక్కర్ కేసులో రేపటి ఈడీ విచారణకు హాజరుకాలేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సుప్రీంకోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులు ఉన్నంతదున తాను విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ రాశారు.