Share News

Phone Ban: తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఫోన్‌ మాట్లాడడంపై నిషేధం

ABN , Publish Date - Sep 13 , 2024 | 03:22 AM

తరగతి గదిలో సెల్‌ఫోన్‌ మాట్లాడే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.

Phone Ban: తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఫోన్‌ మాట్లాడడంపై నిషేధం

  • ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్న విద్యాశాఖ

  • సర్క్యూలర్‌ జారీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తరగతి గదిలో సెల్‌ఫోన్‌ మాట్లాడే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు గురువారం సర్క్యూలర్‌ను జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలు పరచాలని ఆదేశించారు. తరగతి గదుల్లో కొందరు ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌ మాట్లాడుతున్నట్టు సమాచారం ఉందని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.


దీనిని నివారించడం కోసం సర్క్యూలర్‌ను జారీ చేసినట్లు చెప్పారు. దీని ప్రకారం ఇక నుంచి తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌ మాట్లాడడం నిషేధం. సీసీఏ మార్గదర్శకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నట్టు అధికారులు తమ సర్క్యూలర్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.

Updated Date - Sep 13 , 2024 | 03:22 AM