జనవరి 31లోగా విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: విద్యాశాఖ
ABN , Publish Date - Dec 24 , 2024 | 05:24 AM
పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన వివరాలను వచ్చే జనవరి 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన వివరాలను వచ్చే జనవరి 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు డీఈవోలు, ఎంఈవోలు, హెడ్‌మాస్టర్లను బాధ్యులుగా చేస్తూ తాజాగా విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులిచ్చారు. విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో న మోదు చేసేందుకు వీలుగా కొంతకాలంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 3శాతమే ఇది పూర్తయింది. దీంతో ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించడంతో తాజా ఆదేశాలు జారీ అయ్యాయి.
డిగ్రీ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్‌కు కొత్త కార్యవర్గం
తెలంగాణ డిగ్రీ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్‌కు కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. అధ్యక్షుడిగా శ్రీనివా్‌సగౌడ్, ప్రధాన కార్యదర్శిగా సౌందర్య బ్రిసెఫ్, మహిళా కార్యదర్శిగా భవాని, ఆర్థిక కార్యదర్శిగా గంగాధర్ ఎన్నికయ్యారు.