Share News

Electricity: ఆ ఏరియాల్లో సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్‌ సరఫరా బంద్..

ABN , Publish Date - Nov 23 , 2024 | 08:25 AM

చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మతుల కారణంగా ఉప్పల్‌, మల్కాజిగిరి(Uppal, Malkajgiri) నియోజకవర్గాల్లో శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రామంతాపూర్‌ సబ్‌స్టేషన్‌(Ramanthapur Substation) పరిధిలోని చర్చికాలనీ ఫీడర్‌లో ఈనెల 23న 10.30 గంటల నుంచి 4 గంటల వరకు విద్యుత్‌ ఉండదని ఏఈ లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు.

Electricity: ఆ ఏరియాల్లో సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్‌ సరఫరా బంద్..

హైదరాబాద్: చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మతుల కారణంగా ఉప్పల్‌, మల్కాజిగిరి(Uppal, Malkajgiri) నియోజకవర్గాల్లో శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రామంతాపూర్‌ సబ్‌స్టేషన్‌(Ramanthapur Substation) పరిధిలోని చర్చికాలనీ ఫీడర్‌లో ఈనెల 23న 10.30 గంటల నుంచి 4 గంటల వరకు విద్యుత్‌ ఉండదని ఏఈ లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: JNTU: జేఎన్‌టీయూలో ఎన్నాళ్లీ ‘ఇన్‌చార్జీల పాలన’


కుషాయిగూడ: 11కేవీ పెద్ద చర్లపల్లి ఫీడర్‌ పరిధిలో శనివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు చర్లపల్లి సబ్‌స్టేషన్‌ ఏఈ ఏ.బాబు రావు ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా రాంపల్లి ఫీడర్‌ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, భరత్‌ నగర్‌ ఫీడర్‌ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30గంటల వరకు కరెంటు ఉండదని ఆయన వెల్లడించారు.


కాప్రా: సైనిక్‌పురి ఫీడర్‌ పరిధిలోని సైనిక్‌పురి-1, 2, 3, 4, 5 ఎవెన్యూలలో శనివారం ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విద్యుత్‌ ఉండదని సైనిక్‌పురి సబ్‌స్టేషన్‌ ఏఈ సత్యనారాయణ తెలిపారు.

ఉప్పల్‌: బోడుప్పల్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిఽధిలోని 11 కేవీ మారుతీనరగ్‌ ఫీడర్‌, 11కేవీ బొల్లిగూడెం ఫీడర్‌, 11 కేవీ సరస్వతినగర్‌ ఫీడర్‌, 11 కేవీ వివేకానంద ఫీడర్‌ పరిధిలో పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్‌ ఉండదని విద్యుత్‌ ఏఈ వేణుగోపాల్‌ తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఈవార్తను కూడా చదవండి: Sarpanch: కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్‌ ఆత్మహత్య

ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది!

ఈవార్తను కూడా చదవండి: వామ్మో...చలి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 23 , 2024 | 08:25 AM