Share News

జర్నలిస్టుల రైల్వేపా్‌సలను పునరుద్ధరించండి

ABN , Publish Date - Nov 28 , 2024 | 04:46 AM

కరోనా సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రాయితీ రైల్వేపా్‌సలను పునరుద్ధరించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్టుల రైల్వేపా్‌సలను పునరుద్ధరించండి

  • కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఈటల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, మల్కాజిగిరి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : కరోనా సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రాయితీ రైల్వేపా్‌సలను పునరుద్ధరించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో రైల్వేమంత్రిని కలిసి నియోజకవర్గానికి చెందిన పలు రైల్వే సమస్యలను వివరించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న ఆర్‌యూబీ, ఆర్‌వోబీల పనుల కోసం వినతిపత్రం సమర్పించారు.

Updated Date - Nov 28 , 2024 | 04:46 AM