Home » Malkajgiri
నాగర్‌కర్నూల్, మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్లను బాంబులతో పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఈ-మెయిల్స్‌తో ఒక్కసారిగా కలకలం రేగింది. కరీంనగర్‌కు చెందిన మావోయిస్టు ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు పేరిట కలెక్టర్లకు ఈ-మెయిల్స్ వచ్చాయి.
ఈ సారి మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అనుచరులతో కలిసి తమ భూమిలోకి వచ్చి అక్కడున్న వారిపై దాడి చేయడం సరికాదని భూమి యజమానులు, శ్రీహర్ష కన్స్ట్రక్షన్స్ భాగస్వాములు ఆలూరి వెంకటేష్, ఆలూరి విజయభాస్కర్ అన్నారు.
మల్కాజిగిరి ఎంపీ, మాజీమంత్రి ఈటల రాజేందర్(Malkajgiri MP and former minister Etala Rajender)ను మీర్‌పేట్‌కు చెందిన బీజేపీ నేతలు, కార్పొరేటర్లతో కలిసి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలన్ శంకర్‌రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
గత పాలకులు 1998 సంవత్సరంలో అరుంధతినగర్‌లో కుటుంబ నియంత్రన చేసుకున్న వారికి అప్పటి ప్రభుత్వం పట్టాలను ఇస్తే వాటిని కూల్చడం ఏమిటని మల్కాజిగిరి ఎంపీ ఈట ల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) రెవెన్యూ అధికారుల తీరుపై మండి పడ్డారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)కు కూతవేటు దూరంలో ఉన్న మల్కాజిగిరి రైల్వేస్టేషన్(Malkajgiri Railway Station) అభివృద్ధితో రూపురేఖలు మారనున్నాయి. అమ్రిత్ భారత్ స్టేషన్ సికింద్రాబాద్‌స్కీంలో భాగంగా ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు సంబందించి నిర్మాణాలు చకచక జరిగిపోతున్నాయి.
ఆకలి ఉన్నవారికే అధికారం రావాలని, ప్రజల ఆకలి సమస్యలు అర్థం చేసుకోవడమే నిజమైన అంబేడ్కర్ స్ఫూర్తి అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) అన్నారు. చైతన్యం, త్యాగాలు, ప్రజాస్వామ్యం లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదన్నారు. అధికారం కొనుక్కుంటే వచ్చేది కాదన్నారు.
భారతదేశమే కాకుండా ప్రపంచం మెచ్చిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మాగాంధీ అని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) పేర్కొన్నారు. రక్తపు బొట్టు చిందించకుండా దేశానికి స్వాతంత్రం సాధించడం ద్వారా ప్రపంచానికి అహింస పద్ధతితో పోరాటం అనే ఆయుధాన్ని గాంధీ అందించారని ఆయన అన్నారు.
దేశంలో వ్యవసాయం, దుస్తులు ఆఖరికి ఇల్లు కావాలన్నా.. జీవించడానికి కావాల్సిన ప్రతి ప్రధాన పని విశ్వకర్మలతోనే ముడిపడి ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) పేర్కొన్నారు.
కరోనా సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రాయితీ రైల్వేపా్‌సలను పునరుద్ధరించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు.