Farmers: అప్పుల బాధతో రైతు, గల్ఫ్ కార్మికుడి ఆత్మహత్య
ABN , Publish Date - Nov 02 , 2024 | 05:29 AM
అప్పుల బాధతో ఓ రైతు రైతు, మరో ఘటనలో గల్ఫ్ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన చెన్నూరి
ఏటూరునాగారం, గంభీరావుపేట, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): అప్పుల బాధతో ఓ రైతు రైతు, మరో ఘటనలో గల్ఫ్ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన చెన్నూరి మల్లయ్య(55)కు ఆరెకరాల భూమి ఉండగా మిర్చి పండిస్తున్నాడు. సుమారు రూ.7 లక్షల అప్పు అయ్యింది. అప్పు తీర్చే మార్గం లేక మనస్తాపం చెందిన మల్లయ్య బుధవారం తన పొలం వద్ద గడ్డి మందు తాగాడు. ఇంటికి వచ్చి సొమ్మసిల్లిన అతడిని కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
చికిత్స చేస్తుండగా గురువారం సాయంత్రం మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన ఆవునూరి భాస్కర్(28) బతుకు దెరువు కోసం అప్పులు చేసి మూడుసార్లు గల్ఫ్‌కు వెళ్లాడు. వెళ్లిన ప్రతీసారి సరైన పనిలేక అవస్థలు పడ్డాడు. పస్తులు ఉండే పరిస్థితి రావడంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. అప్పులు సుమారు రూ.5 లక్షల వరకు పేరుకుపోయాయి. అవి తీర్చే మార్గం లేక మానసికంగా కుంగిపోయాడు. గురువారం తెల్లవారు జామున పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు.