Mahabubnagar: 30న పాలమూరులో సీఎం సభ: జూపల్లి
ABN , Publish Date - Nov 25 , 2024 | 02:39 AM
ఈనెల 28 నుంచి మహబూబ్‌నగర్ పట్టణంలో మూడ్రోజుల పాటు రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
మహబూబ్‌నగర్, నవంబరు24(ఆంధ్రజ్యోతి): ఈనెల 28 నుంచి మహబూబ్‌నగర్ పట్టణంలో మూడ్రోజుల పాటు రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 30వ తేదీన లక్షలాది మంది రైతులతో సీఎం రేవంత్‌రెడ్డి సభ నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమం నిర్వహణ, ఏర్పాట్లపై మహబూబ్‌నగర్ కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఉమ్మడి పాలమూరుకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిఽధులు, అధికారులతో జూపల్లి సమీక్ష నిర్వహించారు.
అనంతరం దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్ మండల పరిధిలో రైతు సదస్సు నిర్వహించనున్న సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. సదస్సులో వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించి 150 స్టాళ్లతో ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. రైతు సంబురాలను రాష్ట్రంలోని 600 రైతు వేదికల ద్వారా రైతులు వీక్షించేలా ప్రత్యక్షప్రసారం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు.