Share News

Farmers: రైతులే కాడెడ్లుగా మారి..

ABN , Publish Date - Nov 03 , 2024 | 04:40 AM

చెడిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతుల కోసం రైతులు పడరాని పాట్లు పడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించేందుకు సరైన రోడ్డులేక వారే కాడెడ్లుగా మారి ఎడ్లబండిని లాగారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలంలో జరిగింది.

Farmers: రైతులే కాడెడ్లుగా మారి..

చెడిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతుల కోసం రైతులు పడరాని పాట్లు పడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించేందుకు సరైన రోడ్డులేక వారే కాడెడ్లుగా మారి ఎడ్లబండిని లాగారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలంలో జరిగింది. కొత్తపల్లిలోని వ్యవసాయ తోటల మధ్యలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయింది. పంటకు నీరు పారించేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. దీంతో ట్రాన్స్‌ఫార్మర్‌ను మరమ్మతుల కోసం తరలించాలని నిర్ణయించారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో.. పంట చేను మధ్యలో నుంచే అర కిలోమీటర్‌ దూరంలో ఉన్న మెయిన్‌ రోడ్డు వరకు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎడ్లబండిపై లాగారు.

- ఆంధ్రజ్యోతి, వేల్పూర్‌

Updated Date - Nov 03 , 2024 | 04:40 AM