Share News

Floods : ముగ్గురిలో ఒక్కరే బతికారు!

ABN , Publish Date - Sep 02 , 2024 | 03:47 AM

భారీ వర్షాల కారణంగా పాలేరు జలాశయానికి భారీగా వరద పోటెత్తడంతో.. ముగ్గురు సభ్యుల (తల్లి, తండ్రి, కుమారుడు) కుటుంబం వరద నీటిలో కొట్టుకుపోయింది

Floods : ముగ్గురిలో ఒక్కరే బతికారు!

  • ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో

  • వాన నీటిలో కొట్టుకుపోయిన కుటుంబం

  • తల్లి, తండ్రి గల్లంతు.. కుమారుడు క్షేమం

ఖమ్మం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల కారణంగా పాలేరు జలాశయానికి భారీగా వరద పోటెత్తడంతో.. ముగ్గురు సభ్యుల (తల్లి, తండ్రి, కుమారుడు) కుటుంబం వరద నీటిలో కొట్టుకుపోయింది! వారిని కాపాడేందుకు రెస్క్యూటీం, పోలీసులు ఎంతగా ప్రయత్నించినా.. తల్లి, తండ్రి గల్లంతయ్యారు. వారి కుమారుణ్ని మాత్రమే రక్షించగలిగారు. ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో జరిగిందీ ఘటన. ఆ గ్రామంలో నివాసం ఉంటున్న షేక్‌ యాఖుబ్‌ ఇంటిని పాలేరు అలుగు నీరు చుట్టుముట్టింది.


దీంతో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు యాఖుబ్‌(48), ఆయన భార్య సైదాబి(45), కుమారుడు షరీఫ్‌ ఇంటిపైకి ఎక్కారు. వారు ముగ్గురూ వరదలో చిక్కుకున్నారన్న సమాచారం తెలుసుకున్న అధికారులు కాపాడేందుకు ప్రయత్నించారు. డ్రోన్ల సాయంతో వారికి సేఫ్టీ జాకెట్లను అందించారు. ఈ క్రమంలోనే వరద ఉధృతి పెరిగి ఇంటిగోడ కూలడంతో ముగ్గురూ నీటిలో కొట్టుకుపోయారు. కిలోమీటరు దూరంలో.. ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారిపై ఉన్న కానిస్టేబుల్‌ రాంబాబు వారిని గమనించి వెంటనే తాళ్లసాయంతో షరీ్‌ఫను రక్షించాడు. యాఖూబ్‌, సైదాబీ ఆచూకీ ఇంకా దొరకలేదు. వారికోసం గాలింపు కొనసాగుతోంది.

Updated Date - Sep 02 , 2024 | 03:48 AM