Share News

Former MLA: ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్ట్‌ పెట్టిస్తా..

ABN , Publish Date - Aug 08 , 2024 | 10:31 AM

గత ప్రభుత్వం హయాంలో బీఆర్‌ఎస్‌ నేతలు కబ్జా చేసిన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీ నం చేసుకుంటామని, ఇకపై కబ్జాదారుల ఆటలు సాగబోవని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(Kichchennagari Lakshmareddy) స్పష్టం చేశారు.

Former MLA: ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్ట్‌ పెట్టిస్తా..

- మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్‌ హెచ్చరిక

హైదరాబాద్: గత ప్రభుత్వం హయాంలో బీఆర్‌ఎస్‌ నేతలు కబ్జా చేసిన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీ నం చేసుకుంటామని, ఇకపై కబ్జాదారుల ఆటలు సాగబోవని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(Kichchennagari Lakshmareddy) స్పష్టం చేశారు. ప్రభుత్వ భూ ములను కబ్జా చేసే వారిపై పీడీ యాక్ట్‌ కింద కేసులు పెట్టిస్తానని ఆయన హెచ్చరించారు. బుధవారం మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి(Former MLA of Maheshwaram Thigala Krishna Reddy)తో కలిసి ఆయన మీర్‌పేట్‌లోని సిర్లాహిల్స్‌, పెద్దచెరువు, అల్మా్‌సగూడ కోమటికుంటచెరువు తదితర ప్రాంతాలను సందర్శించి అక్కడి ప్రభుత్వ భూములను పరిశీలించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: పేదోడి ఆకలి తీరేదెట్లా..?


ఈ సందర్భంగా స్థానిక దళిత రైతులు మాట్లాడుతూ తాము దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను కొందరు నేతలు బలవంతంగా లాక్కున్నారని, చెరువులను సైతం కబ్జా చేశారని ఆరోపించారు. తాము సాగు చేసుకున్న భూములను తమకే అప్పగించాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం కేఎల్లార్‌ మాట్లాడుతూ దళితుల భూములు దళితులకే చెందేలా చూస్తామని, తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా కాంగ్రెస్‌ హయాంలో దళితులకు ఇచ్చిన భూములను తిరిగి వారికే ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

city3.2.jpg


ఒకవేళ భూములు తిరిగి ఇవ్వడానికి నిబంధనలు అడ్డువస్తే అక్కడి రైతులకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో చర్చించి, ఆ దిశలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ పల్లె పాండుగౌడ్‌, మాజీ జడ్పీటీసీ బంగారు సత్యనారాయణ, కోఆప్షన్‌ సభ్యుడు పల్లె జంగయ్యగౌడ్‌, నాయకులు సామిడి గోపాల్‌రెడ్డి, పోరెడ్డి భాస్కర్‌రెడ్డి, దాసరి బాబు, చల్లా బాల్‌రెడ్డి, సిద్దాల శ్రీశైలం, కీసరి యాదిరెడ్డి, బోయపల్లి వెంకట్‌రెడ్డి, గోవింద్‌రెడ్డి, రామిడి కృష్ణారెడ్డి, నవారు మల్లారెడ్డి, తీగల సాయినాథ్‌రెడ్డి, ఎరుకలి రవిగౌడ్‌ పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Updated Date - Aug 08 , 2024 | 10:31 AM