Share News

Manda Jagannatham: మాజీ ఎంపీ మందాజగన్నాథం పరిస్థితి విషమం

ABN , Publish Date - Dec 27 , 2024 | 03:57 AM

మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

Manda Jagannatham: మాజీ ఎంపీ మందాజగన్నాథం పరిస్థితి విషమం

నాగర్‌కర్నూల్‌/హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో హైదరాబాద్‌ నిమ్స్‌లోని ఆర్‌ఐసీయూ విభాగంలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్నారు. 12 గంటలు గడిస్తే తప్పా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని నిమ్స్‌ వైద్యులు గురువారం బులెటిన్‌లో పేర్కొన్నారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు పర్యాయాలు నాగర్‌కర్నూల్‌ ఎంపీగా, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగానూ ఆయన వ్యవహరించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌ నేతలతో కలసి నిమ్స్‌లో మందాను పరామర్శించారు.

Updated Date - Dec 27 , 2024 | 03:57 AM