Free Power: ఇకపై అందరికీ ఉచిత విద్యుత్.. ఎలా అంటే..?
ABN , Publish Date - Jun 14 , 2024 | 07:47 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహజ్యోతి పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే ఛార్జీ వేయరు. లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందు చాలా మంది ప్రజాపాలన దరఖాస్తు చేశారు. కొందరికి మాత్రం గృహజ్యోతి పథకం అమలు కాలేదు. అలాంటి వారు అప్లై చేసుకునే అవకాశం ఇస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహజ్యోతి పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే ఛార్జీ వేయరు. లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందు చాలా మంది ప్రజాపాలన దరఖాస్తు చేశారు. కొందరికి మాత్రం గృహజ్యోతి పథకం అమలు కాలేదు. అలాంటి వారు అప్లై చేసుకునే అవకాశం ఇస్తోంది.
అర్హులు ఎవరంటే..?
గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి. 200 యూనిట్ల కన్నా తక్కువ కరెంట్ వినియోగించే వారికి బెటర్. ఎక్కువ యూజ్ చేస్తే అదనపు యూనిట్లకు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. పట్టణాలు, నగరాల్లో కిరాయికి ఉంటున్న వారు కూడా అర్హత కలిగి ఉంటారు. అందుకోసం యజమాని పేరు మీద మీటర్ ఉందని నిరూపించే పత్రాలు అందజేయాల్సి ఉంటుంది.
అప్లై చేసి ఉంటే..
ఒకవేళ ఇదివరకు ప్రజాపాలన దరఖాస్తు చేసి.. విద్యుత్ మీటర్ రాయని వారికి కూడా అవకాశం ఇస్తున్నారు. సదరు వ్యక్తి గ్రామ పంచాయితీ లేదంటే మున్సిపాలిటీ ఆఫీసుకు వెళ్లి ప్రజా పాలన దరఖాస్తు చీటి చూపి విద్యుత్ మీటర్‌కు సంబంధించిన బిల్ అందజేయాలి. ఆ తర్వాత నెల నుంచి గృహజ్యోతి పథకం అమలవుతోంది. వారు కూడా నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే జీరో బిల్ వస్తోంది. లేదంటే అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.