Ghazal Srinivas: గజల్ శ్రీనివాస్ ఆడియోలను ఆవిష్కరించిన జ్యోతిర్ మఠ్ శంకరాచార్య..
ABN , Publish Date - Oct 16 , 2024 | 09:23 PM
గజల్ శ్రీనివాస్ గానం చేసిన రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలను జ్యోతిర్ మఠ్ శంకరాచార్య శ్రీ అవి ముక్తేశ్వరానంద సరస్వతి ఆవిష్కరించారు.

తిరువనంతపురం, అక్టోబర్ 16: గజల్ శ్రీనివాస్ స్వరపరచి, గానం చేసిన పోతన విరచిత భాగవతంలోని ముఖ్య 108 పద్యాలు, కవిత్రయం రచించిన ఆంధ్ర మహాభారతంలోని ముఖ్యమైన 108 పద్యాలు, డా.ముకుంద శర్మ వ్రాసిన గేయ రామాయణాల ఆడియోలను ఉత్తరాఖండ్ జ్యోతిర్ మఠ్ శంకరాచార్య శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీ తిరువనంతపురం (కేరళ) శ్రీ పద్మనాభ స్వామి వారి ఏకాంత దర్శన అనంతరం వేలాది మంది భక్తుల సమక్షంలో ఆవిష్కరించారు.
సనాతన ధర్మంలో అతి ముఖ్యమైన రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలను ఒకే రోజు ఆవిష్కరించడం అతి గొప్ప ధార్మిక కార్యక్రమము అని, వీటిని స్వరపరచి సందర్భ, తాత్పర్య సహితంగా అందరికీ అర్ధమయ్యేలా గానం చేసిన డా.గజల్ శ్రీనివాస్ అభినందనీయుడని శంకరాచార్య అన్నారు. ఆడియో తొలి ప్రతులను సి.ఎల్.రాజం దంపతులకు, మిజోరం పూర్వ గవర్నర్ కుమ్మనం రాజశేఖర్‌లకు అందించారు.
Also Read:
ముత్యాలమ్మ గుడిపై దాడి వెనుక భారీ కుట్ర..!
'జడ్ ప్లస్' వీఐపీలకు ఎన్‌ఎస్‌జీ స్థానే సీఆర్‌పీఎఫ్ భద్రత
కాబోయే సీఎం ఎవరో చెప్పిన ఫడ్నవిస్
For More Telanganan News and Telugu News..