Share News

Flood Relief: వరద బాధితులకు ఉద్యోగుల ఒక రోజు వేతనం

ABN , Publish Date - Sep 20 , 2024 | 04:14 AM

వరద బాధితుల సహాయార్థం ఉద్యోగుల ఒక రోజు మూల వేతనాన్ని ప్రభుత్వం మినహాయించింది.

Flood Relief: వరద బాధితులకు ఉద్యోగుల ఒక రోజు వేతనం

  • సింగరేణి ఉద్యోగుల సాయం రూ.10.25 కోట్లు

  • నెల జీతం రూ.2.5లక్షలు ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని

హైదరాబాద్‌, కొత్తగూడెం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వరద బాధితుల సహాయార్థం ఉద్యోగుల ఒక రోజు మూల వేతనాన్ని ప్రభుత్వం మినహాయించింది. ఈమేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం అన్ని కేటగిరీల ఉద్యోగులకు సంబంధించిన ఒక రోజు మూలవేతనాన్ని మినహాయిస్తున్నట్టు వెల్లడించింది. వరద బాధితుల కోసం సింగరేణి ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని సీఎంఆర్‌ఎ్‌ఫకు అందించారు.


ఈ మేరకు రూ.10.25 కోట్ల చెక్కును సింగరేణి అధికారులు, యూనియన్ల నాయకులు సీఎం రేవంత్‌కు అందజేశారు. అలాగే, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన ఒక నెల జీతం రూ.2.50 లక్షల చెక్కును అందజేశారు. ఫిల్మ్‌నగర్‌ కల్చరర్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎన్‌సీసీ) తరపున ప్రెసిడెంట్‌ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు రూ.25లక్షలను సీఎంఆర్‌ఎ్‌ఫకు విరాళంగా అందజేశారు.

Updated Date - Sep 20 , 2024 | 04:14 AM