Share News

Bhatti : సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి సిద్ధం

ABN , Publish Date - Oct 15 , 2024 | 03:37 AM

సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సచివాలయంలో జరిగిన గద్దర్‌ సినీ అవార్డుల కమిటీ మొదటి సమావేశంలో ఆయన మాట్లాడారు.

Bhatti : సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి సిద్ధం

  • అన్ని అంశాలను పరిశీలించాకే గద్దర్‌ పేరిట అవార్డులు

  • అవార్డుల ప్రదాన కార్యక్రమం గొప్ప పండుగలా జరగాలి

  • గద్దర్‌ అవార్డుల కమిటీ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సచివాలయంలో జరిగిన గద్దర్‌ సినీ అవార్డుల కమిటీ మొదటి సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం గద్దర్‌ పేరిట సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. గద్దర్‌ అవార్డుల ప్రదాన కార్యక్రమం గొప్ప పండుగలా జరగాలని, ఏ తేదీన నిర్వహించాలనేది కమిటీ నిర్ణయం తీసుకోవాలన్నారు. త్వరలో కమిటీ మరోసారి సమావేశమై నిర్ణయాలు తీసుకోవాలని భట్టి సూచించారు.


ఈ సందర్భంగా సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ కాన్సెప్ట్‌ అద్భుతంగా ఉందన్నారు. మరోవైపు ప్రభుత్వ స్కిల్‌ యూనివర్సిటీలో యాక్టింగ్‌ స్కిల్స్‌ను నేర్పించేందుకు ప్రత్యేక కోర్సును ప్రవేశపెట్టాలని కమిటీ సభ్యులు కోరారు. సమావేశంలో కమిటీ సభ్యులు బి.నర్సింగ్‌రావు, తనికెళ్ల భరణి, దగ్గుబాటి సురేష్‌ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, దిల్‌రాజు, హరిశంకర్‌, వందేమాతరం శ్రీనివాస్‌, అల్లాని శ్రీధర్‌, గుమ్మడి విమల, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2024 | 03:37 AM