Governor Tamilisai: ఈ సంక్రాంతి అందరికీ స్పెషల్
ABN , Publish Date - Jan 13 , 2024 | 09:34 AM
గవర్నర్ తమిళి సై తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ సంక్రాంతి అందరికీ స్పెషల్ అని పేర్కొన్నారు.
హైదరాబాద్: గవర్నర్ తమిళి సై తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ సంక్రాంతి అందరికీ స్పెషల్ అని పేర్కొన్నారు. ఈ ఏడాది అయోధ్య రామ మందిరం ప్రారంభం కాబట్టి అందరికీ ప్రత్యేకమేనన్నారు. రామ్ మందిర్ పాటను తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నామన్నారు. ఢిల్లీ వెళ్తున్నామని సంక్రాంతి పండుగ వేడుకల కోసం వెళ్తున్నామన్నారు. ఢిల్లీ పర్యటన రాజకీయ పర్యటన కాదని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.