Home » governor Tamilisai
ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ అమలు ప్రస్తుతానికి లేనట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో అడ్మిషన్లు, నియామకాల్లో రిజర్వేషన్లను అమలు పరచాలని ప్రభుత్వం ఇంతకు ముందు భావించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమర్థవంతమైన వారధి నిర్మించేందుకు గవర్నర్లు కీలక పాత్ర పోషించాలని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు.
తెలంగాణ కొత్త గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. సోమవారం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.
తమిళిసై ఇవాళ తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో గవర్నర్ కోటాకు సంబంధించి ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం(Kodandaram), మీర్ అమీర్ అలీఖాన్(Mir Ameer Ali Khan) నియమితులైన విషయం తెలిసిందే. మంగళవారం నాడు జరిగిన కేబినెట్ భేటీలో వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తూ మంత్రులు తీర్మానం చేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో మరోసారి కేబినెట్ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.
Telangana: తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన ముగిసింది. కాసేపటి క్రితమే సంగారెడ్డి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి వీడ్కోలు పలికారు. ఆపై బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఒరిస్సాకు ప్రధాని బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
Telangana: మేడారం సమక్క - సారమ్మ మహా జాతర వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే పెద్దసంఖ్యలో భక్తులు మేడారంకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రి అర్జున్ ముండా మేడారం చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్, కేంద్రమంత్రి నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళి సై ‘ఎక్స్’ ఖాతా హ్యాక్ విచారణను అధికారులు ముమ్మరం చేశారు. ముంబై నుంచే గవర్నర్ తమిళి సై ‘ఎక్స్’ ఖాతా హ్యాక్ అయినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అక్కడి ఓ బొటెక్ వైఫై నెట్‌వర్క్‌ను దుండగుడు వినియోగించినట్టు సాంకేతిక ఆధారాల ద్వారా కనిపెట్టారు.
Telangana: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గురువారం మొదలయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగంలో మొదటి పేజీలో పొందుపరిచిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అమోదించారు. ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram ), మీర్ అమీర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.