Share News

MLC Bypoll: నేడు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్

ABN , Publish Date - May 27 , 2024 | 07:03 AM

నేడు నల్గొండ -ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ జరగనుంది.12 జిల్లాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులున్నారు. బ్యాలెట్ ద్వారా పట్టభద్రుల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

MLC Bypoll: నేడు పట్టభద్రుల  నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్

నల్గొండ: నేడు నల్గొండ -ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ జరగనుంది.12 జిల్లాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులున్నారు. బ్యాలెట్ ద్వారా పట్టభద్రుల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఓటర్లు 4,63,839, 605 కాగా.. పోలింగ్ కేంద్రాలు, 807 బ్యాలెట్ బాక్సులున్నాయి. పురుష ఓటర్లు...2 లక్షల 88 వేల 189 మంది, మహిళలు లక్ష 75 వేల 645 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మూడు జిల్లాల్లో లక్షా 66 వేల 448 మంది ఓటర్లు, 205 పోలింగ్ కేంద్రాలున్నాయి.

Hyderabad: వేలం గ్యారెంటీ...


నల్గొండ జిల్లాలో 80,871 మంది ఓటర్లుండగా.. వారిలో పురుష ఓటర్లు 51,560.. మహిళా ఓటర్లు 29,311 మంది ఉన్నారు. వీరి కోసం 97 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 144 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో 51,497 మంది ఓటర్లుండగా..పురుష ఓటర్లు 34,176 మంది.. మహిళా ఓటర్లు 17,321 మంది ఉన్నారు. వీరి కోసం 71 పోలింగ్ కేంద్రాలు. 99 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలో 34,080 మంది ఓటర్లుండగా.. పురుష ఓటర్లు 20,838 మంది.. మహిళా ఓటర్లు 13,242 మంది ఉన్నారు. వీరికోసం 37 పోలింగ్ కేంద్రాలు, 59 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జిల్లాలో 40106 పట్టభద్ర ఓటర్లున్నారు. 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల,కొమురవెళ్లి,మద్దూరు, దూల్మిట్ట మండల కేంద్రాలలో ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాలుగు మండలాల్లో 4659 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియగించుకోనున్నారు.

Hyderabad: మళ్లీ కోతలు ..

Read Telangana News and Telugu News

Updated Date - May 27 , 2024 | 07:03 AM