Share News

Krishnashtami Whishes: రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్, కేసీఆర్

ABN , Publish Date - Aug 26 , 2024 | 10:17 AM

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని వారు ఆకాంక్షించారు. ఇందుకు సంబంధించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Krishnashtami Whishes: రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్, కేసీఆర్

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని వారు ఆకాంక్షించారు. ఇందుకు సంబంధించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. "రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి(Krishnashtami Celebrations) శుభాకాంక్షలు. మానవ జీవితంలో ‘గీత’ బోధనలు ప్రభావశీలమైనవి. మానవుడి ప్రతి దశలోనూ కృష్ణ భగవానుడు కొలువై ఉంటాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని ప్రార్థిస్తున్నా" అని రేవంత్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

"శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు!" అని కేసీఆర్ పోస్ట్ చేశారు. " వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్. సమస్త లోక రక్షకుడు యశోదానందనుడు, ధర్మాన్ని స్థాపించి, అధర్మాన్ని, అన్యాయాన్ని అంతం చేసిన పవిత్ర జగద్గురువు అవతార మూర్తి జన్మాష్టమి పర్వదినం. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు" అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ పేర్కొన్నారు. వీరితోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి చెందిన ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.


ఘనంగా వేడుకలు..

తెలుగు రాష్ట్రాల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. శ్రీ కృష్ణుడి ఆలయాల ముందు భక్తుల రద్దీ నెలకొంది. హైదరాబాద్‌లో ప్రముఖ ఇస్కాన్ టెంపుల్, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, శ్రీ రాధాకృష్ణ దేవాలయం తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చిన్ని కృష్ణయ్యకు ప్రీతిపాత్రమైన పాలు, నెయ్యి, వెన్నె తదితర ఆహారపదార్థాలను నైవేథ్యం సమర్పించడానికి క్యూ కట్టారు. తెలంగాణ, ఏపీలోని అన్ని జిల్లాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖులు ఆలయాలబాట పట్టారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు.

For Latest News click here

Updated Date - Aug 26 , 2024 | 10:20 AM