Harish Rao: సమగ్రశిక్ష ఉద్యోగుల నిర్బంధంపై హరీశ్ ఆగ్రహం
ABN , Publish Date - Dec 26 , 2024 | 03:43 AM
మెదక్ పట్టణంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను ముఖ్యమంత్రి పర్యటన ఉందంటూ శిబిరం నుంచి బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తరలించిన ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్
హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మెదక్ పట్టణంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను ముఖ్యమంత్రి పర్యటన ఉందంటూ శిబిరం నుంచి బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తరలించిన ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్రశిక్ష ఉద్యోగుల టెంట్ల ముందు నుంచి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి వారి టెంట్లు పీకేయించడంకాకుండా వారి సమస్య పరిష్కరిస్తే బాగుంటుందన్నారు. 15 రోజులుగా ఆందోళన చేస్తున్న వారి సమస్యను అర్థం చేసుకోవాలని కోరారు.
గత ఏడాది ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తానని, వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తానని హమీ ఇచ్చి... ఏడాది గ డి చినా ప్రభుత్వం నుంచి ఉలుకూపలుకూ లేదని విమర్శించారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న విధంగానే కాంగ్రెస్ పార్టీ వీరిని మోసం చేసిందని హరీశ్‌రావు మండిపడ్డారు. ఎన్నికలకు ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని బీఆర్‌ఎస్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు.