Share News

Harish Rao: రేవంత్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Sep 20 , 2024 | 04:37 AM

మహాభారతంలో దుర్యోధనుడిలా సీఎం రేవంత్‌రెడ్డి ప్రవర్తన ఉందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధమని మాజీమంత్రి హరీశ్‌ రావు విమర్శించారు.

Harish Rao: రేవంత్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి

  • ఖర్గే, రాహుల్‌కు హరీశ్‌ రావు లేఖ

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మహాభారతంలో దుర్యోధనుడిలా సీఎం రేవంత్‌రెడ్డి ప్రవర్తన ఉందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధమని మాజీమంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కేసీఆర్‌పై ఆయన ఉపయోగిస్తున్న అసభ్యకరమైన భాష, నేరపూరిత వ్యాఖ్యలను అరికట్టాలని, ఆయనపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ.. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీకి గురువారం లేఖ రాశారు. ‘రాహుల్‌ గాంధీపై బీజేపీ తీవ్రవాది అని వ్యాఖ్యలు చేస్తే.. రాజకీయాల్లో దిగజారుడు విమర్శలంటూ కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది.


అలాంటి దూషణలే రేవంత్‌రెడ్డి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? ఇది ద్వంద్వ వైఖరి కాదా? ఢిల్లీలో ఒక రూల్‌ గల్లీలో ఒక రూల్‌ మీకే చెల్లుతుంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు. రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో రైతాంగం సంఘటితమై ఛలో ప్రజాభవన్‌కు పిలుపునిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వణుకు పుట్టిందని, అందుకే రైతులను, రైతు సంఘాల నాయకులను పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించారని హరీశ్‌ ఆరోపించారు. రైతుల అక్రమ అరెస్టులు దుర్మార్గమని, తీవ్రంగా ఖండిస్తున్నానని ఎక్స్‌లో పేర్కొన్నారు.

Updated Date - Sep 20 , 2024 | 04:37 AM