Share News

Harish Rao: కానిస్టేబుళ్ల సరెండర్‌ లీవ్స్‌ సొమ్మును వెంటనే చెల్లించాలి

ABN , Publish Date - Aug 22 , 2024 | 04:25 AM

రాష్ట్రంలోని పోలీసు కానిస్టేబుళ్లకు రావాల్సిన సరెండర్‌ లీవ్స్‌, అడిషనల్‌ సరెండర్‌ లీవ్స్‌ సొమ్మును వెంటనే చెల్లించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు.

Harish Rao: కానిస్టేబుళ్ల సరెండర్‌ లీవ్స్‌ సొమ్మును వెంటనే చెల్లించాలి

  • డిప్యూటీ సీఎం భట్టికి హరీశ్‌రావు లేఖ

హైదరాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పోలీసు కానిస్టేబుళ్లకు రావాల్సిన సరెండర్‌ లీవ్స్‌, అడిషనల్‌ సరెండర్‌ లీవ్స్‌ సొమ్మును వెంటనే చెల్లించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. ఈమేరకు బుధవారం ఆయన డిప్యూటీ సీఎంకు లేఖ రాశారు. ఈ సెలవులకు సంబంధించి కొన్ని జిల్లాల్లోని కానిస్టేబుళ్లకు మాత్రమే సొమ్మును చెల్లించారని.. కామారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని దాదాపు ఆరు వేల మంది కానిస్టేబుళ్లకు 8 నెలలుగా పెండింగ్‌ పెట్టారని తెలిపారు.


పెట్రోల్‌, డీజిల్‌ బిల్లులు కూడా నెలల తరబడి రాకపోవడంతో పోలీసులు, పెట్రోల్‌ బంక్‌ నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. కానిస్టేబుళ్ల పట్ల ఎందుకింత వివక్ష, పక్షపాతం అని ఆయన ప్రశ్నించారు. ఈ పద్ధతి పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే అవుతుందన్నారు. తక్షణమే పోలీసుల పెండింగ్‌ బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.


  • సర్కారు నిర్లక్ష్యం వల్లే విషజ్వరాలకు ప్రజలు బలి

కాంగ్రెస్‌ సర్కారు నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్ర ప్రజలు విషజ్వరాలకు బలవుతున్నారని, డెంగీ బారిన పడి 24 గంటల్లోనే అయిదుగురు ప్రాణా లు కోల్పోవడం అత్యంత బాధాకరమని హరీశ్‌ రావు అన్నారు. డెంగీ, మలేరియా, గున్యా వంటి విషజ్వరాలతో రాష్ట్రం వణుకుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం శోచనీయమన్నారు. ప్రభు త్వం నిర ్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందని ఎక్స్‌ వేదికగా ఆయన ఆరోపించారు.


  • రేవంత్‌ పాపపరిహారం కోసం యాదాద్రిలో పూజలు చేస్తా

ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తానని యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామిపై సీఎం రేవంత్‌రెడ్డి ఒట్టుపెట్టి మాట తప్పిన నేపథ్యంలో రాష్ట్రానికి కీడు జరగకూడదని గురువారం యాదాద్రిలో పూజలు నిర్వహించనున్నట్లు హరీశ్‌ రావు తెలిపారు. రేవంత్‌రెడ్డి పాపపరిహారం కోసం.. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం తనతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Aug 22 , 2024 | 04:25 AM