Share News

Rains: పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

ABN , Publish Date - Sep 01 , 2024 | 12:22 PM

ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ప్రాజెక్టులలోకి భారీగా వరదనీరు చేరుతుంది. బ్రిడ్జీల పైన, రైల్వే ట్రాక్ వద్దకు భారీగా వర్షపునీరు చేరింది. దాంతో కొన్ని రైళ్లను నిలిపివేశామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Rains: పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు
Trains Cancel

హైదరాబాద్: వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షం దంచికొడుతోంది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ప్రాజెక్టులలోకి భారీగా వరదనీరు చేరుతుంది. బ్రిడ్జీల పైన, రైల్వే ట్రాక్ వద్దకు భారీగా వర్షపునీరు చేరింది. దాంతో కొన్ని రైళ్లను నిలిపివేశామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.


rain-1.jpg


వర్ష బీభత్సంతో తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఆరు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. 9 రైళ్లను దారి మళ్లించింది. ఈ మేరకు ప్రకట చేసింది.


rainss.jpg


రద్దుచేసిన రైళ్ల వివరాలు

విజయవాడ- సికింద్రాబాద్

సికింద్రాబాద్-విజయవాడ

గుంటూరు- సికింద్రాబాద్

సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్

సికింద్రాబాద్- గుంటూరు

గుంటూరు-సికింద్రాబాద్ రైళ్లను రద్దు చేశారు.


trains.jpg


విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు.

విజయవాడ- తెనాలి

విజయవాడ- గూడురు

తెనాలి-రేపల్లె

గుడివాడ- మచిలీపట్నం

భీమవరం-నిడదవోలు

గుంటూరు- రేపల్లె

విజయవాడ- మచిలీపట్నం

విజయవాడ- ఒంగోలు మధ్య నడిచే రైళ్లను నిలిపివేశామని ప్రకటన చేసింది.


car.jpg


దారి మళ్లించిన రైళ్ల వివరాలు

విశాఖపట్టణం- నాందేడ్ రైలును విజయవాడ గుంటూరు నల్గొండ పగిడిపల్లి మీదుగా దారి మళ్లించారు.

విశాఖపట్టణం తిరుపతి రైలును గుంటూరు నల్గొండ పగిడిపల్లి మీదుగా మళ్లించారు.

తాంబరం-హైదరాబాద్ రైలును గుంటూరు నల్గొండ పగిడిపల్లి మీదుగా దారి మళ్లించారు.

దానపూర్-బెంగళూర్ రైలును కాజిపేట, సికింద్రాబాద్, సులేహల్లి, గుంతకల్లు, ధర్మవరం మీదుగా మళ్లించారు.

నిజాముద్దీన్ కన్యాకుమారి రైలును కాజిపేట, సికింద్రాబాద్, సులేహల్లి, గుంతకల్లు, కడప, రేణిగుంట, అరక్కొణం, చెన్పై బీచ్ మీదుగా మళ్లలించారు.

సీఎస్టీ ముంబై- భువనేశ్వర్ రైలును సికింద్రాబాద్, పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా దారి మళ్లించారు.

భువనేశ్వర్- సీఎస్టీ ముంబై రైలును విజయవాడ, గుంటూరు. పగడిపిల్లి, సికింద్రాబాద్ మీదుగా మళ్లించారు.

విశాఖపట్టణం-ఎల్టీటీ ముంబై రైలును విజయవాడ గుంటూరు పగడిపల్లి సికింద్రాబాద్ మీదుగా మళ్లించారు.

విజయవాడ హైదరాబాద్ రైలును విజయవాడ గుంటూరు నల్గొండ, పగడిపల్లి, సికింద్రాబాద్ మీదుగా మళ్లించారు.


Read Latest
Telangana News and National News

Updated Date - Sep 01 , 2024 | 12:22 PM