Share News

30 ఏళ్లు పని చేసిన సిబ్బంది హక్కులను కాదనలేరు: హైకోర్టు

ABN , Publish Date - Nov 10 , 2024 | 02:51 AM

దాదాపు 30 ఏళ్లపాటు సేవలు అందించిన నాలుగో తరగతి ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు కాలరాయలేవని హైకోర్టు వ్యాఖ్యానించింది.

30 ఏళ్లు పని చేసిన సిబ్బంది హక్కులను కాదనలేరు: హైకోర్టు

హైదరాబాద్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): దాదాపు 30 ఏళ్లపాటు సేవలు అందించిన నాలుగో తరగతి ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు కాలరాయలేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ బెవరేజెస్‌ కార్పొరేషన్‌లో 30 ఏళ్ల సుదీర్ఘ సర్వీసును పూర్తిచేసుకున్నప్పటికీ రెగ్యులరైజ్‌ చేయకపోవడం వారి హక్కులను నిరాకరించడం కిందకే వస్తుందని పేర్కొంది. ఇప్పటికీ సర్వీసులో ఉన్న 47మంది ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని జస్టిస్‌ అనిల్‌కుమార్‌ ధర్మాసనం ఆదేశిం చింది. రిటైర్‌ అయిన, చనిపోయిన ఉద్యోగులకు సర్వీసు అనంతర పెన్షనరీ బెనిఫిట్స్‌ అందజేయాలని స్పష్టం చేసింది.


  • ఏడేళ్లయినా స్వీపర్‌ జీతం ఇవ్వరా?

సూర్యాపేట జిల్లా చిలుకూరు పోలీ్‌సస్టేషన్‌లో స్వీపర్‌గా పనిచేసిన ఉద్యోగికి వేతనం చెల్లించాలని 2017లో ఇచ్చిన ఉత్తర్వులు అమలుకాకపోవడంపై జస్టిస్‌ అనిల్‌కుమార్‌ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. 27వ తేదీ నాటికి సమస్య పరిష్కారం కాకపోతే హోంశాఖ ముఖ్యకార్యదర్శి తమ ఎదుట ప్రత్యక్షంగా హాజరుకావాలని స్పష్టంచేసింది.

Updated Date - Nov 10 , 2024 | 02:51 AM