Share News

High Court: మద్దూరి విజయ్‌ పోలీసుల ఎదుట హాజరుకావాలి

ABN , Publish Date - Nov 06 , 2024 | 03:47 AM

జన్వాడ ఫాంహౌస్‌ పార్టీ కేసులో రెండో నిందితుడిగా ఉన్న మద్దూరి విజయ్‌ ఈ నెల 6న మోకిల పోలీసుల ఎదుట హాజరుకావాలని.. ఇందుకు న్యాయవాది సహాయం తీసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది.

High Court: మద్దూరి విజయ్‌ పోలీసుల ఎదుట హాజరుకావాలి

  • న్యాయవాది సహాయం తీసుకోవచ్చు : హైకోర్టు

హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : జన్వాడ ఫాంహౌస్‌ పార్టీ కేసులో రెండో నిందితుడిగా ఉన్న మద్దూరి విజయ్‌ ఈ నెల 6న మోకిల పోలీసుల ఎదుట హాజరుకావాలని.. ఇందుకు న్యాయవాది సహాయం తీసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. పోలీసులు తనను వేధిస్తున్నారని పేర్కొంటూ పిటిషనర్‌, నిందితుడు మద్దూరి విజయ్‌ హైకోర్టులో రిట్‌పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదిస్తూ.. గత నెల 27న ఫాంహౌస్‌ పార్టీపై దాడులు చేసి పిటిషనర్‌ను నిర్బంధించారని.. రాత్రి 10.30 గంట నుంచి ఉదయం 8.30 గంటల వరకు పోలీ్‌సస్టేషన్‌లోనే ఉంచారని పేర్కొన్నారు.


వాంగ్మూలం కోసం వేధించారని ఆరోపించారు. మళ్లీ ఈనెల 4న బీఎన్‌ఎ్‌సఎ్‌స 35 (3) నోటీసు జారీచేశారని.. రెండురోజుల్లో విచారణకు హాజరుకావాలని వేధిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌ వాదిస్తూ.. బీఎన్‌ఎ్‌సఎ్‌స 35 (3) నోటీసు ఇచ్చిన తర్వాత కూడా అరెస్ట్‌ చేస్తారని పిటిషనర్‌ చెప్పడం కేవలం ఆందోళన మాత్రమేనని పేర్కొన్నారు. అరెస్ట్‌ చేస్తారని.. వేధిస్తారని భయపడాల్సిన అవసరం లేదని.. కేసు ఇంకా విచారణలో ఉందని.. చట్టప్రకారం వ్యవహరిస్తామని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం ఈనెల 6న ఉదయం 10.30 గంటల నుంచి 1.30 గంటల మధ్యలో పిటిషనర్‌ పోలీసుల ఎదుట హాజరుకావాలని.. న్యాయవాది సహాయం తీసుకోవచ్చని.. పిటిషనర్‌ దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది.

Updated Date - Nov 06 , 2024 | 03:47 AM