Share News

ACB: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్‌ను ఏడవ రోజు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ..

ABN , Publish Date - Feb 06 , 2024 | 05:03 PM

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు ఏడవ రోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. శివ బాలకృష్ణ ఆస్తులు, బినామీ అకౌంట్లపై ఏసీబీ ఆరా తీస్తున్నారు. ఇప్పటికే వందల ఎకరాల్లో భూములు, కిలోల కొద్దీ బంగారం, వెండి, పెద్ద మొత్తంలో నగదును అధికారులు గుర్తించారు.

ACB: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్‌ను ఏడవ రోజు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ..

హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు ఏడవ రోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. శివ బాలకృష్ణ ఆస్తులు, బినామీ అకౌంట్లపై ఏసీబీ ఆరా తీస్తున్నారు. ఇప్పటికే వందల ఎకరాల్లో భూములు, కిలోల కొద్దీ బంగారం, వెండి, పెద్ద మొత్తంలో నగదును అధికారులు గుర్తించారు.

ఇక ప్రస్తుతం 2021 నుంచి 2023 వరకూ హెచ్ఎండీఏలో శివ బాలకృష్ణ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఇచ్చిన అనుమతులపై ఏసీబీ కూపీ లాగుతోంది. రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టిన పెట్టుబడులపై సైతం అధికారులు వివరాలు సేకరించారు. హెచ్ఎండీఏ కార్యాలయంలో దొరికిన ఫైల్స్, డాక్యుమెంట్స్‌ని ఏసీబీ పరిశీలిస్తోంది. బినామీ ఆస్తులను గుర్తించింది. రేపటితో శివ బాలకృష్ణ 8 రోజుల రిమాండ్ పూర్తి కానుంది.

Updated Date - Feb 06 , 2024 | 05:03 PM