Share News

Mahabubabad: అనుమానంతో.. భార్యను ఉరి వేసి చంపి బావిలో వేలాడదీసిన భర్త

ABN , Publish Date - Dec 02 , 2024 | 04:44 AM

కేసముద్రం స్టేషన్‌లోని ఉప్పరపల్లి రోడ్‌లో ఆదివారం బత్తుల అనూష(30)ను ఆమె భర్త ఉరి వేసి చంపి, ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించినట్లు రూరల్‌ సీఐ సర్వయ్య తెలిపారు.

Mahabubabad: అనుమానంతో.. భార్యను ఉరి వేసి చంపి బావిలో వేలాడదీసిన భర్త

  • హత్య కేసు నమోదు చేసిన పోలీసులు

  • మహబూబాబాద్‌ జిల్లాలో ఘటన

కేసముద్రం(మహబూబాబాద్‌ జిల్లా), డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : కేసముద్రం స్టేషన్‌లోని ఉప్పరపల్లి రోడ్‌లో ఆదివారం బత్తుల అనూష(30)ను ఆమె భర్త ఉరి వేసి చంపి, ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించినట్లు రూరల్‌ సీఐ సర్వయ్య తెలిపారు. కేసముద్రం స్టేషన్‌కు చెందిన బత్తుల వీరన్నకు ఇదే మండలం బేరువాడ బోడమంచ్యా తండాకు చెందిన కాముని కుమారస్వామి పెద్ద కుమార్తె అనూషతో 2011లో వివాహం జరిగింది. వీరికి 11 ఏళ్ల కుమారుడు రాజేష్‌ సంతానం. కుమారుడు జన్మించిన అనంతరం అనూషను అనుమానిస్తూ వీరన్న తరచూ గొడవ పడుతున్నాడు. నాలుగు రోజుల క్రితం రాజేష్‌ తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా వీరన్న అర్ధరాత్రి దాటిన తర్వాత అనూష మెడకు చీరను బిగించి చంపాడు.


మృతదేహాన్ని ఇంటి వెనుకనున్న చేదబావి వద్దకు లాక్కెళ్లి చీరతో మెడకు, బావి గిరక దూలానికి కట్టి మృతదేహాన్ని బావిలోకి నెట్టి వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించాడు. తర్వాత తన భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని బంధువు ఒకరికి తెలిపి పరారయ్యాడు. ఈ సమాచారం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవపరీక్షకు పంపించారు. హత్య చేసిన అనంతరమే మృతదేహానికి ఉరి వేసినట్లు శవ పరీక్షలో ప్రాథమికంగా తేలిందని సీఐ వెల్లడించారు. అనూష తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Dec 02 , 2024 | 04:44 AM