Hydenabad: ఇక్కడ 365 రోజులూ ఇంతే!
ABN , Publish Date - Nov 13 , 2024 | 09:55 AM
అవును ఇది ముమ్మాటీకి వాటర్‌వర్క్స్ అధికారుల నిర్లక్ష్యమే. సంవత్సరంలో 365రోజులు డ్రైనేజీ పొంగకుండా ఉన్న రోజంటూ లేదు. ఏళ్ల తరబడి ఇక్కడ నివసిస్తున్న స్థానికుల వెతలు అన్నీ ఇన్నీకావు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు.
- సూరారం కాలనీలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ
- సమస్యకు పరిష్కారమెప్పుడు?
- ఇది ముమ్మాటీకి వాటర్‌వర్క్స్ అధికారుల నిర్లక్ష్యమే.
- మురుగు వాసన, దోమలతో నరకం చూస్తున్నాం : స్థానికుల ఆందోళన
జీడిమెట్ల(హైదరాబాద్): అవును ఇది ముమ్మాటీకి వాటర్‌వర్క్స్ అధికారుల నిర్లక్ష్యమే. సంవత్సరంలో 365రోజులు డ్రైనేజీ పొంగకుండా ఉన్న రోజంటూ లేదు. ఏళ్ల తరబడి ఇక్కడ నివసిస్తున్న స్థానికుల వెతలు అన్నీ ఇన్నీకావు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు. డ్రైనేజీ వ్యవస్థ జీహెచ్‌ఎంసీ(GHMC) నుంచి వాటర్‌వర్క్స్‌కు బదలాయింపు జరిగినప్పటి నుంచి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్వహణ అధ్వాన్నంగా తయారైందని స్థానికులు బాహాటంగా ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. పురాతన కాలంలో వేసిన పైప్‌లైన్‌లే నేటికి ఉండటంతో పెరిగిన జనాభాకు అనుగుణంగా పైప్‌లైన్ కెపాసిటీ సరిపోకపోవడంతో మురుగునీరు నిత్యం రోడ్లపైనే పారుతుంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభా్‌షనగర్ డివిజన్ సూరారంకాలనీ ప్రధాన రహదారిపై పొంగిపొర్లుతున్న డ్రైనేజీ వ్యవస్ధను ఆంధ్రజ్యోతి పరిశీలించింది.
ఈ వార్తను కూడా చదవండి: BRS: పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై బీఆర్‌ఎస్ కీలక నేతలు ఏమన్నారంటే
సుభాష్ నగర్ డివిజన్ సూరారంకాలనీ(Suraram Colony)లో లక్షలమంది జనాభా నివసిస్తున్నారు. నివాసాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అధికారులు విఫలమవుతున్నారు. ప్రధానంగా మొదటి ఓంజెండా సమీపంలో కూరగాయాల మార్కెట్, షాపులు నిర్వహిస్తుంటారు. మార్కెట్ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా మారడంతో మురుగునీరు పొంగిపొర్లుతుంది. దీంతో మార్కెట్‌కు వచ్చే ప్రజలు, ఈ రోడ్డు ప్రయాణించే వారు మురికినీటితో నరకం చూస్తున్నారు.
ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, వాటర్ వర్క్స్ అధికారులు సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. చీకటిపడితే దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమలు కుట్టి అనేక మంది విషజ్వరాల బారినపడి, ఆస్పత్రుల పాలవుతున్నారు. స్థానికు లు అనేకమార్లు ప్ర జావాణిలో ఫిర్యాదు కూడా చేశారు. అలాగే స్థానిక కార్పొరేటర్‌కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని స్థానిక మహిళలు పేర్కొంటున్నారు.
నిత్యం నరకం చూస్తున్నాం
ఇక్కడ 365 రోజులు మురికినీరు రోడ్డుపైన పారుతున్నది. డ్రైనేజీ వాసనతో నిత్యం నరకం చూస్తున్నాం. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కనీసం వచ్చి చూసిన పాపానపోవడం లేదు. అంటువ్యాధులు ప్రబలి ఆసుపత్రుల పాలవుతున్నాం. తక్షణమే సమస్య పరిష్కరించాలి.
- అనిత, స్థానికురాలు
పట్టించుకోవడం లేదు
నిత్యం వేలాదిమంది ప్రయాణించే ఈ రోడ్డు మురికినీటితో అధ్వానంగా మారింది. డ్రైనేజీ నీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాసన భరించలేక చచ్చిపోతున్నాం. ప్రజాప్రతినిధులు వస్తున్నారు, పోతున్నారే తప్పా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడం లేదు.
- షబాన బేగం
రూ.47 లక్షలతో అంచనాలు పంపించాం
సూరారంకాలనీ ప్రధాన రహదారిపై పొంగిపొర్లుతున్న డ్రైనేజీ పరిస్థితిపై స్థానిక వాటర్‌వర్స్స్ మేనేజర్ మల్లేశ్వర్‌రావును ప్రశ్నించగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య మా దృష్టికి వచ్చింది. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకువెళ్లామని, 47 లక్షల ఎస్టిమేట్‌తో ఉన్నతాధికారులకు సమర్పించాం. ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. నిధులు మంజూరైన వెంటనే టెండర్ పిలిచి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు.
- మల్లేశ్వరరావు, సూరారం డివిజన్ వాటర్‌వర్క్స్ మేనేజర్
ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల' దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం
ఈవార్తను కూడా చదవండి: హనుమకొండ ఆస్పత్రిలో ఎలుకల స్వైరవిహారం
ఈవార్తను కూడా చదవండి: ఫిలింనగర్‌లో యువతి ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: ఇదేనా నీ పాలన.. రేవంత్‌పై హరీష్ కామెంట్స్
Read Latest Telangana News and National News