Hyderabad: మేడారానికి 800 సిటీ బస్సులు..
ABN , Publish Date - Feb 17 , 2024 | 11:21 AM
మేడారం(Medaram) జాతరకు 800కు పైగా సిటీబస్సులు తరలివెళ్లనున్నాయి. 21 నుంచి 24 వరకు జరిగే జాతర కోసం గ్రేటర్‌జోన్‌లోని పలు డిపోల నుంచి దశలవారీగా బస్సులను తరలించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తునట్లు సమాచారం.
- గ్రేటర్‌జోన్‌లో ఉన్నవి 2,600
- సిటీ ప్రయాణికులకు ఇక్కట్లు తప్పవా?
హైదరాబాద్ సిటీ: మేడారం(Medaram) జాతరకు 800కు పైగా సిటీబస్సులు తరలివెళ్లనున్నాయి. 21 నుంచి 24 వరకు జరిగే జాతర కోసం గ్రేటర్‌జోన్‌లోని పలు డిపోల నుంచి దశలవారీగా బస్సులను తరలించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తునట్లు సమాచారం. గ్రేటర్‌జోన్‌లో ఆర్టీసీ 2,600 బస్సులు నడుపుతుండగా, వాటిలో 800 మేడారానికి వెళ్తే సిటీలో బస్సుల సంఖ్య తగ్గి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. అయితే 21వ తేదీ నుంచి 24 వరకు నాలుగురోజుల పాటు ప్రయాణికుల రద్దీ సాధారణం కంటే తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నగరంలో రోజూ 21 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు.
మరో 400 ప్రత్యేక బస్సులు
మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఈనెల 18 నుంచి 400 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ ప్రాంతాల నుంచి ఈ బస్సులను నడుపుతామని వెల్లడించారు.