Share News

Hyderabad: 824 నివాసాలు.. 149 కూల్చివేతలు...

ABN , Publish Date - Oct 05 , 2024 | 10:38 AM

మూసీ సుందరీకరణలో భాగంగా కూల్చివేతల ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటివరకు రివర్‌బెడ్‌(Riverbed) కింద గుర్తించిన మొత్తం నిర్మాణాల్లో 25 శాతం కూడా తొలగించలేదు. అయితే మూసీ మురికి నుంచి ఉపశమనం పొందాలంటే డబుల్‌ బెడ్‌రూమ్‌(Double bedroom) ఇళ్లకు వెళ్తే బాగుంటుందని రెవెన్యూ అధికారులు గంటలకొద్దీ కౌన్సిలింగ్‌లు ఇస్తున్నప్పటికీ చాలామంది ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.

Hyderabad: 824 నివాసాలు.. 149 కూల్చివేతలు...

- ఇప్పటివరకు చర్యలు అంతంతమాత్రమే

- రివర్‌బెడ్‌లోని మొత్తం 1,595 నిర్మాణాల్లో.. 1,333 వరకు మార్కింగ్‌

- నిరసనలు, ఆందోళనలతో 262 చోట్ల ఆగిన ప్రక్రియ

- కమర్షియల్‌ భవనాల జోలికి వెళ్లేందుకు వెనుకంజ

- ప్రభుత్వ ఆదేశాల తర్వాతే ముందుకుసాగనున్న యంత్రాంగం

హైదరాబాద్‌ సిటీ: మూసీ సుందరీకరణలో భాగంగా కూల్చివేతల ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటివరకు రివర్‌బెడ్‌(Riverbed) కింద గుర్తించిన మొత్తం నిర్మాణాల్లో 25 శాతం కూడా తొలగించలేదు. అయితే మూసీ మురికి నుంచి ఉపశమనం పొందాలంటే డబుల్‌ బెడ్‌రూమ్‌(Double bedroom) ఇళ్లకు వెళ్తే బాగుంటుందని రెవెన్యూ అధికారులు గంటలకొద్దీ కౌన్సిలింగ్‌లు ఇస్తున్నప్పటికీ చాలామంది ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఆపరేషన్‌ మూసీలో భాగంగా హైదరాబాద్‌ జిల్లాలో నదీ గర్భం (రివర్‌బెడ్‌)లో మొత్తం 1,595 నివాసగృహాలు, కమర్షియల్‌ భవనాలు, నిర్మాణాలను గుర్తించారు. ఈ మేరకు మూసీ ప్రభావిత మండలాల్లో 1,333 వరకు మార్కింగ్‌ చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Bathukamma: నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ.. నైవేద్యం ఇదే


మిగతా 262 చోట్ల ఆర్‌బీ-ఎక్స్‌ గుర్తులు పెట్టేందుకు వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకుని నిరసనలు తెలియజేయడంతో వెనక్కి వచ్చారు. కాగా, మార్కింగ్‌ చేసిన వాటిలో 824 ఇళ్లు ఉండగా.. 771 వరకు దుకాణాలు, షెడ్డు, ఇతరత్రా కమర్షియల్‌ నిర్మాణాలున్నాయి. అయితే నివాసగృహాల్లో 149 వరకు మాత్రమే కూల్చివేయగా.. మిగతా యజమానులను ఒప్పించి పంపించేందుకు అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. తహసీల్దార్ల ఆధ్వర్యంలో ముగ్గురు, నలుగురు సిబ్బంది తమ పరిధిలోని బస్తీలకు వెళ్లి మాట్లాడుతున్నప్పటికీ డబుల్‌ బెడ్‌రూమ్‌లకు వెళ్లేందుకు ముందుకురావడం లేదని తెలుస్తోంది.


ఇది మా అడ్డా..!

సైదాబాద్‌, హిమాయత్‌నగర్‌, నాంపల్లి(Saidabad, Himayatnagar, Nampally) మండలాల్లోని వివిధ బస్తీలు, కాలనీలకు చెందిన 193 మందిని మలక్‌పేట్‌లోని పిల్లిగుడిసెలు, జియాగూడ, ప్రతాపసింగారం, జంగంమెట్‌లోని రెండు పడకల గృహసముదాయానికి తరలించారు. అయితే నాంపల్లి, బహదూర్‌పురా, ఓల్డ్‌ మలక్‌పేట్‌, చాదర్‌ఘాట్‌ ప్రాంతాల్లో తమ తాత, ముత్తాతల నుంచి వారసత్వంగా కొనసాగుతున్న దుకాణాలు, కార్ఖానాలను, వ్యాపార సముదాయాలను వదిలి వెళ్లేందుకు యజమానులు ముందుకురాని పరిస్థితి నెలకొంది. తమ నిర్మాణాలకు రివర్‌బెడ్‌ మార్కింగ్‌ వేస్తే బాగుండదని, ఇది తమ అడ్డా.. అంటూ అధికారులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది.


వారం రోజుల క్రితం ఓల్డ్‌ మలక్‌పేట్‌లోని శంకర్‌బస్తీలో ఉన్న వివిధ కమర్షియల్‌ బిల్డింగుల దగ్గరకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిని ముట్టడించి వాగ్వాదానికి దిగడంతో వారు అక్కడి నుంచి తిరిగి వెళ్లినట్లు సమాచారం. తమకు మూసీ ఇబ్బందులేమీ లేవని, అనవసరంగా వచ్చి ఇబ్బందులు పడితే బాగుండదని హెచ్చరించినట్లు తెలిసింది. కాగా, రివర్‌బెడ్‌ కింద ఉన్న నివాసగృహాలకు ఇచ్చిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కమర్షియల్‌ భవనాల యజమానులకు ఇవ్వకపోతుండడంతో చాలామంది ఆసక్తి చూపించడం లేదు. తప్పనిసరిగా ఖాళీ చేయాలంటే తమకు నష్టపరిహారం ఇవ్వాలని యజమానులు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాతనే అధికారులు కమర్షియల్‌ భవనాల జోలికి వెళ్లనున్నారు.


ఉన్నతాధికారుల సమీక్షతో పరేషాన్‌..

మూసీనది ప్రక్షాళన.. రెవెన్యూ అధికారులకు కత్తిమీద సాములాగా మారింది. ఓవైపు రివర్‌బెడ్‌ మార్కింగ్‌ చేసిన ఇళ్లను సకాలంలో కూల్చివేసి, అక్కడివారిని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు తరలించాలని, మరోవైపు కమర్షియల్‌ బిల్డింగులను కూల్చివేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తుండడంతో పరేషాన్‌ అవుతున్నారు. మూసీనదీ తీరం నుంచి ఖాళీ చేయాలని కోరుతున్నప్పటికీ చాలామంది ఆసక్తి చూపకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.


నిర్వాసితులతో సమావేశాలు, తరలింపు పక్రియ, ఉన్నతాధికారుల సమీక్ష, స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో రెండు వారాలుగా సతమతమవుతున్నామని పలువురు తహసీల్దార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, మొదటి దశలోని రివర్‌బెడ్‌ పరిస్థితి ఈ విధంగా ఉంటే.. రెండో దశలో చేపట్టనున్న బఫర్‌జోన్‌ కూల్చివేతలు ఎలా ఉంటాయోనని ఇప్పటి నుంచే వారు కలవరపడుతున్నారు. మొత్తంగా మూసీ సుందరీకరణ ప్రక్రియ నిర్వాసితులతో పాటు అధికారులను సైతం హడలెతిస్తోంది.


ఇదికూడా చదవండి: Hyderabad: రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో..

ఇదికూడా చదవండి: KBR Park: 7 వంతెనలు.. 7 సొరంగ మార్గాలు

ఇదికూడా చదవండి: Harish Rao,: దసరా తర్వాత ఢిల్లీలో ధర్నా

ఇదికూడా చదవండి: నా కుమారుల ఫామ్‌హౌ్‌సలు ఎక్కడున్నాయో చూపించాలి?

Read Latest Telangana News and National News

Updated Date - Oct 05 , 2024 | 10:38 AM