Share News

Hyderabad: ఎన్‌కౌంటర్లపై సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి

ABN , Publish Date - Dec 18 , 2024 | 12:28 PM

చత్తీస్ ఘడ్‌ నారాయణపూర్‌(Chattisgarh Narayanpur)లోని అటవీ ప్రాంతంలో ఈ నెల 11, 12 తేదీల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లు బూటకమని అని ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌(Professor G. Haragopal) ఆరోపించారు.

Hyderabad: ఎన్‌కౌంటర్లపై సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి

హైదరాబాద్: చత్తీస్ ఘడ్‌ నారాయణపూర్‌(Chattis garh Narayanpur)లోని అటవీ ప్రాంతంలో ఈ నెల 11, 12 తేదీల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లు బూటకమని అని ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌(Professor G. Haragopal) ఆరోపించారు. ముఖ్యంగా చత్తీస్ ఘడ్‌లోని ఆదివాసీల ఖనిజ సంపదను బడా కార్పొరేట్‌ సంస్థలకు పాలకులు ధారదత్తం చేస్తున్నారని, అందుకే ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక మనిషి ప్రాణాలు తీయడం రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: New Year: ‘మత్తు’లో ముంచేయాలని.. న్యూ ఇయర్‌ వేడుకలే లక్ష్యంగా డ్రగ్స్‌, గంజాయి దిగుమతి


ఈ ఎన్‌కౌంటర్లపై సిట్టింగ్‌ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదర్‌గూడ(Hyderguda)లోని ఎన్‌ఎ్‌సఎ్‌సలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జి.లక్ష్మణ్‌, సీఎల్‌పీ ప్రధాన కార్యదర్శి ఎన్‌.నారాయణరావుతో కలిసి ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడారు. కేంద్రమంత్రి అమిత్‌షా(Union Minister Amit Shah) 2026 మార్చి వరకు మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా అణచివేస్తామని,


city8.jpg

నక్సలైట్లు అనే వారు లేకుండా చేస్తామని బహిరంగంగా ప్రకటించారని గుర్తుచేశారు. ఇందులో భాగంగానే చత్తీస్ ఘడ్‌లో విలువైన ఖనిజాలు ఉండడంతో వాటిని కార్పొరేట్‌ సంస్థలకు అప్పనంగా పాలకులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్‌కౌంటర్లఉ చేయడం ప్రారంభించాయని విమర్శించారు. కార్యక్రమంలో వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ప్రొఫెసర్‌ అన్వర్‌ఖాన్‌, ఐఎ్‌ఫటీయు నాయకులు అనురాధ, షేక్‌ షావలి పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Youth Addiction : మృత్యు వలయం

ఈవార్తను కూడా చదవండి: బీఆర్ఎస్ నేతలకు సవాల్, చర్చకు సిద్ధమా..

ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు

ఈవార్తను కూడా చదవండి: లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 18 , 2024 | 12:28 PM