Share News

Hyderabad: రెప్పపాటులో తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Nov 06 , 2024 | 07:27 AM

కుమారుడిని ఇంట్లో వదిలేసి తల్లి బయటకెళ్లగా అకస్మాత్తుగా విద్యుదాఘాతం సంభవించి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. స్థానికులు స్పందించి ఇంటి తాళాలు పగులగొట్టి ప్రమాదం బారి నుంచి బాలుడిని రక్షించారు. మంగళవారం మధ్యాహ్నం లోయర్‌ ట్యాంక్‌బండ్‌(Lower Tankbund) డీబీఆర్‌ మిల్స్‌ సమీపంలోని మోతీలాల్‌ నెహ్రూనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Hyderabad: రెప్పపాటులో తప్పిన ప్రమాదం

- కుమారుడిని ఇంట్లో వదిలేసి వెళ్లిన తల్లి

- షార్ట్‌సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు

- తాళాలు పగులగొట్టి బాలుడిని కాపాడిన స్థానికులు

హైదరాబాద్: కుమారుడిని ఇంట్లో వదిలేసి తల్లి బయటకెళ్లగా అకస్మాత్తుగా విద్యుదాఘాతం సంభవించి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. స్థానికులు స్పందించి ఇంటి తాళాలు పగులగొట్టి ప్రమాదం బారి నుంచి బాలుడిని రక్షించారు. మంగళవారం మధ్యాహ్నం లోయర్‌ ట్యాంక్‌బండ్‌(Lower Tankbund) డీబీఆర్‌ మిల్స్‌ సమీపంలోని మోతీలాల్‌ నెహ్రూనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫైర్‌ ఆఫీసర్‌ యుగేందర్‌ప్రసాద్‌(Fire Officer Yugender Prasad) తెలిపిన వివరాల ప్రకారం.. సునీత, మోజెస్‌ భార్యాభర్తలు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. 18 ఏళ్లుగా మోతీలాల్‌ నెహ్రూనగర్‌ బస్తీలో నివాసముంటున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Sridhar Babu: అధికారంలో లేకున్నా.. ప్రజల్లోనే రాహుల్‌ గాంధీ


city1.2.jpg

ఆర్నెళ్ల క్రితం మోజెస్‌ అదృశ్యమవ్వడంతో ఇంట్లో సునీత, కుమార్తె మరియా, కుమారుడు ఆరెంట్‌(5) ఉంటున్నారు. మంగళవారం కుమారుడిని స్కూల్‌ నుంచి తీసుకొచ్చి ఇంట్లో వదిలేసిన సునీత.. కుమార్తె కోసం పాఠశాలకు వెళ్లింది. ఆమె ఇంటికొచ్చేసరికి షార్ట్‌సర్క్యూట్‌(Short circuit)తో మంటలు చెలరేగాయి. గమనించిన చుట్టుపక్కలవారు ఇంటి తాళాలు పగులగొట్టి ఆరెంట్‌ను ప్రాణాలతో కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల ద్వారా మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో 3 తులాల బంగారు నగలు, ఫర్నీచర్‌, ఇతర వస్తువులు కాలిబూడిదయ్యాయి.


ఈవార్తను కూడా చదవండి: అయ్యోపాపం. ఎంతఘోరం.. పాఠశాల గేటు పడి విద్యార్థి దుర్మరణం

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో కులగణన.. దేశానికి నమూనా

ఈవార్తను కూడా చదవండి: Medical Student: అయ్యా.. నాది ఏ రాష్ట్రం?

ఈవార్తను కూడా చదవండి: Uttam: కేంద్ర నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 06 , 2024 | 07:27 AM