Hyderabad: ఔర్ ఏక్‌బార్.. మరోమారు నూతన టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన
ABN , Publish Date - Nov 12 , 2024 | 07:29 AM
ఖమ్మం(Khammam) జిల్లా ఘటనతో ఇటీవల టీచర్ ఉద్యోగాలు పొందిన వారి సర్టిఫికెట్లను మరోసారి పరిశీలించేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు సిద్ధమవుతున్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన సంస్థల్లో శిక్షణ పూర్తి చేశారా ? అనుమతి లేని కళాశాల లేదా తక్కువ సమయంలో కోర్సులు చేశారా ? అన్నదానిపై ఆరా తీస్తున్నారు.
- ‘ఖమ్మం’ ఘటనతో అధికారుల అప్రమత్తం
- డిప్యూటీఈవో, డీఐవోఎ్‌సలకు ఆదేశాలు
- అర్హత సర్టిఫికెట్ల పునఃపరిశీలనకు పరుగులు
హైదరాబాద్ సిటీ: ఖమ్మం(Khammam) జిల్లా ఘటనతో ఇటీవల టీచర్ ఉద్యోగాలు పొందిన వారి సర్టిఫికెట్లను మరోసారి పరిశీలించేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు సిద్ధమవుతున్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన సంస్థల్లో శిక్షణ పూర్తి చేశారా ? అనుమతి లేని కళాశాల లేదా తక్కువ సమయంలో కోర్సులు చేశారా ? అన్నదానిపై ఆరా తీస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పూర్తిస్థాయి కమిషనర్‌గా ఇలంబరిది
అలాంటి వారిని గుర్తిస్తే వెంటనే ఉద్యోగం నుంచి తొలగించేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేసేందుకు ముందుకు సాగుతున్నట్లు తెలిసింది. డీఎస్సీలో 878 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా, ఇటీవల సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత 616 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చారు. ఇందులో 584 మందికి కౌన్సెలింగ్‌లో స్కూల్ అలాట్ చేశారు. మరో 32 మంది సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ పేరిట నిలిపివేశారు.
రెండు, మూడు రోజుల్లో
ఖమ్మం జిల్లాలో ఇటీవల హిందీ పండిట్లు ఉద్యోగాలు పొందిన 19 మందిలో ఏడుగురిని సర్వీసు నుంచి తొలగించారు. దక్షిణ భారత హిందీ ప్రచారసభ (మద్రాసు)లో చదివిన హిందీ కోర్సు ఇక్కడ చెల్లుబాటు కాదని, సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో సరిగ్గా చూడకపోవడంతో మీకు ఉద్యోగాలు వచ్చాయని అక్కడి జిల్లా విద్యాశాఖాధికారి వారి సర్వీసులను రద్దు చేయడంతో లబోదిబోమంటున్నారు.
ఈ ఘటనతో హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారులు తాజాగా మరోసారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నారు. ఈ మేరకు సోమవారం డిప్యూటీ ఈవోలు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (డీఐవోఎ్‌స)ను వారు పనిచేస్తున్న మండలాలకు పంపించి నూతన ఉపాధ్యాయుల సర్టిఫికెట్లపై ఆరా తీసినట్లు సమాచారం. రెండుమూడు రోజుల్లో అర్హత సర్టిఫికెట్ల ఒరిజినల్స్ తీసుకురావాలని, నిబంధనల ప్రకారం ధ్రువపత్రాలు లేకుంటే ఉద్యోగాలు ఉండవని హెచ్చరించినట్లు తెలిసింది.
ఇప్పటికీ వారిపై చర్యలేవి ?
డీఎస్సీ కౌన్సెలింగ్‌లో తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలకు అదనపు టీచర్లను కేటాయించి, కొరత ఉన్న చోటకు పంపించకుండా, జాబితాలో ఖాళీలను సరిగా చూపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు డీఐవోఎస్‌లు, ఒక డిప్యూటీ ఈవోకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇదే ఘటనపై జిల్లా రెవెన్యూ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ విచారణ జరిపి నివేదికను కలెక్టర్‌కు అందజేసినట్లు తెలిసింది. విచారణ పూర్తయి రెండువారాలు గడుస్తున్నప్పటికీ సంబంధిత అధికారులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు... ఏం జరిగిందంటే..
ఈవార్తను కూడా చదవండి: IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: TG News: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...
ఈవార్తను కూడా చదవండి: Khammam: బోనకల్‌లో యాచకుడికి ఐపీ నోటీసు
Read Latest Telangana News and National News