Share News

Hyderabad: జూలై 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం..

ABN , Publish Date - Jun 14 , 2024 | 01:22 PM

బల్కంపేట ఎల్లమ్మ(Balkampeta Ellamma) తల్లి కల్యాణం జూలై 9న వైభవం గా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. జూలై 8న ఒగ్గు కళాకారులతో పుట్టమన్ను తెప్పించడంతో పాటు ఎస్‌ఆర్‌నగర్‌ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఎదుర్కోళ్లు, (శాక్తేయముగా) నిర్వహిస్తూ ఎల్లమ్మ దేవాస్థానం వరకు ఊరేగింపుగా రావడంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

Hyderabad: జూలై 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం..

హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ(Balkampeta Ellamma) తల్లి కల్యాణం జూలై 9న వైభవం గా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. జూలై 8న ఒగ్గు కళాకారులతో పుట్టమన్ను తెప్పించడంతో పాటు ఎస్‌ఆర్‌నగర్‌ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఎదుర్కోళ్లు, (శాక్తేయముగా) నిర్వహిస్తూ ఎల్లమ్మ దేవాస్థానం వరకు ఊరేగింపుగా రావడంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 9న ఆలయానికి తూర్పు ముఖంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో అమ్మవారి కల్యాణం నిర్వహిస్తారు. 10వ తేది 6 గంటలకు కల్యాణం వీక్షించేందుకు రాష్ట్ర నలు మూలల నుంచి వచ్చే భక్తులతో రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి. గత సంవత్సరం నిర్వహించిన కల్యాణానికి భక్తులకు ఎలాంటీ అసౌకర్యాం కలుగకుండా మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(Sanatnagar MLA Talasani Srinivas Yadav) నెల రోజుల ముందుగానే వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించేవారు.

ఇదికూడా చదవండి: Secunderabad: బీదర్‌, పద్మావతి రైలులో దొంగలు పడ్డారు...


ఈ సారి మాత్రం కల్యాణ సమయం దగ్గర పడుతున్నా ఏర్పాట్లు, ఆలయ సుందరీకరణపై ఆలయ చైర్మన్‌, అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈవో నాగరాజు లాంగ్‌ లీవ్‌లో ఉండడం ఇన్‌చార్చి ఈవోగా బాధ్యతలు తీసుకున్న జ్యువెల్లరీ ఇన్‌స్పెక్షన్‌ అధికారి(జేవివో) అంజలి దేవి ఏర్పాట్లపై దృష్టి సారించాలని కోరుతున్నారు. గత సంవత్సరం అమ్మవారి కల్యాణం వీక్షించేందుకు అంచనాలకు మించి భక్తులు 10 లక్షల మంది విచ్చేశారు. ఈ సారి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయనున్న నేపథ్యంలో సౌకర్యాలపై అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 14 , 2024 | 01:22 PM