Share News

Hyderabad: 22న జననం.. ఆనందోత్సాహం

ABN , Publish Date - Jan 23 , 2024 | 11:21 AM

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ రోజున బిడ్డలు జన్మించిన ఇళ్లల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. ఆ రామచంద్రుడి ప్రసాదం అని పలువురు సంతోషం వెలిబుచ్చారు.

Hyderabad: 22న జననం.. ఆనందోత్సాహం

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ రోజున బిడ్డలు జన్మించిన ఇళ్లల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. ఆ రామచంద్రుడి ప్రసాదం అని పలువురు సంతోషం వెలిబుచ్చారు. కొంత మంది ప్రత్యేకంగా సోమవారం ప్రసవం అయ్యేలా ఏర్పాట్లు చేసుకున్నారు. 12.20 నుంచి 12.30 గంటల మధ్య సిజేరియన్‌ చేసేలా వైద్యులను కోరారు. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలోనే ప్రసవం అయ్యేలా సమయం ఫిక్స్‌ చేసుకున్నారు. షాద్‌నగర్‌కు చెందిన ఓ గర్భిణి ఇలాంటి ఏర్పాట్లే చేసుకోగా, పురిటి ఇబ్బందులు ఏర్పడడంతో అనుకున్న సమయం కాకుండా గంట ఆలస్యంగా శస్త్రచికిత్స చేశారు. జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఒంటి గంట వరకు దాదాపు 85 వరకు ప్రసవాలు జరిగినట్లు సమాచారం.

Updated Date - Jan 23 , 2024 | 11:21 AM