Share News

Hyderabad: బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య..

ABN , Publish Date - Dec 07 , 2024 | 06:35 AM

హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దుండిగల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌(Vikarabad) జిల్లా, తాండూర్‌ మండలం, మైలారం కొత్త తండాకు చెందిన బలరామ్‌, కవిత(Balaram, Kavitha) దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.

Hyderabad: బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య..

హైదరాబాద్: హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దుండిగల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌(Vikarabad) జిల్లా, తాండూర్‌ మండలం, మైలారం కొత్త తండాకు చెందిన బలరామ్‌, కవిత(Balaram, Kavitha) దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె శ్రావణి(18) దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ కళాశాల మెయిన్‌ క్యాంప్‌సలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతూ కళాశాల వసతి గృహంలో ఉంటోంది.

ఈ వార్తను కూడా చదవండి: 15 రోజులు.. 200 ట్రాక్టర్‌ బ్యాటరీల చోరీ


శుక్రవారం సహ విద్యార్థులు కళాశాలకు వెళ్లగా.. శ్రావణి వెళ్లలేదు. ఎందుకు వెళ్లలేదని ఫ్లోర్‌ ఇన్‌చార్జి ఆమెను ప్రశ్నించగా.. కడుపునొప్పిగా ఉందని చెప్పింది. తోటి విద్యార్థులు కళాశాల నుంచి మధ్యాహ్నం వసతి గృహానికి రాగా తలుపు వేసి ఉంది. కొట్టినా తీయకపోవడంతో యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు.


వారు వచ్చి తలుపు బద్దలు కొట్టి చూడగా శ్రావణి ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడుతూ ఉంది. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. మృతదేహాన్ని సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ‘సారీ మమ్మీ.. కడుపునొప్పి భరించలేకపోతున్నా’ అని రాసి ఉన్న లెటర్‌ దొరికిందని సీఐ సతీష్‌ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే..

సమాచారం అందుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు కళాశాల వద్దకు చేరుకున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే శ్రావణి చనిపోయిందని ఆరోపిస్తూ ధర్నా చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: డ్రగ్స్‌, సైబర్‌ నేరాల విచారణకు.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపం

ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు

ఈవార్తను కూడా చదవండి: Kodangal: రెండు రోజుల కస్టడీకి పట్నం నరేందర్‌ రెడ్డి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 07 , 2024 | 06:35 AM