Share News

Hyderabad: కులగణన పత్రాలు రోడ్డుపాలు..

ABN , Publish Date - Nov 23 , 2024 | 09:23 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Government) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కులగణన సర్వేపత్రాలు రోడ్డుపక్కన పడేసిన విషయం వెలుగులోకి వచ్చింది. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌(Jawaharnagar Corporation)లో ఈ విషయం చోటుచేసుకుంది.

Hyderabad: కులగణన పత్రాలు రోడ్డుపాలు..

- జవహర్‌నగర్‌ సర్వే పత్రాలు తార్నాకలో దర్శనం

హైదరాబాద్: జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌(Jawaharnagar Corporation)లో నిర్వహించిన కులగణన సర్వే పత్రాలు తార్నాక రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయి ఉన్న దృశ్యాలు శుక్రవారం సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Government) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కులగణన సర్వేపత్రాలు కొద్ది రోజుల క్రితమే మేడ్చల్‌ హైవే(Medchal Highway) పక్కన దర్శనమిచ్చాయి. ఈ సంఘటన మరవక ముందే జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ సర్వే పత్రాలు తార్నాకాలో దర్శనమివ్వడంతో సర్వేపై పలువురు పెదవి విరుస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: KTR: లగచర్ల ఘటన: చర్లపల్లి జైలుకు కేటీఆర్.. ఎందుకంటే..


స్పందించని మున్సిపల్‌ కమిషనర్‌

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌(Jawaharnagar Corporation) కులగణన సర్వే పత్రాలు తార్నాక రోడ్డుపై పడి ఉన్న విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని వివరణ కోరేందుకు ఫోన్‌లో పలుమార్లు సంప్రదించినా కమిషనర్‌ స్పందించలేదు.


ఈవార్తను కూడా చదవండి: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఈవార్తను కూడా చదవండి: Sarpanch: కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్‌ ఆత్మహత్య

ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది!

ఈవార్తను కూడా చదవండి: వామ్మో...చలి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 23 , 2024 | 09:23 AM