Hyderabad: మారిన వాతావరణం.. 20 డిగ్రీలుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Dec 27 , 2024 | 06:58 AM
నగరం ముసురేసింది. రోజంతా కురుస్తున్న ముసురు, చిరుజల్లులతో ప్రజలు తడిసి ముద్దయ్యారు. దీంతో గురువారం వాతావరణం పూర్తిగా మారిపోయింది. చిరుజల్లులతో రహదారులు బురదమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
- ఇబ్బందులు పడిన నగరవాసులు
హైదరాబాద్ సిటీ: నగరం ముసురేసింది. రోజంతా కురుస్తున్న ముసురు, చిరుజల్లులతో ప్రజలు తడిసి ముద్దయ్యారు. దీంతో గురువారం వాతావరణం పూర్తిగా మారిపోయింది. చిరుజల్లులతో రహదారులు బురదమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రెండు రోజులుగా కురుస్తున్న చిరుజల్లులతో చలితీవ్రత తగ్గి రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. వారం రోజులక్రితం 8-10 డిగ్రీలకు పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20-21 డిగ్రీలకు పెరిగాయి.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: వీడిన ‘గోనెసంచిలో డెడ్‌బాడీ’ మిస్టరీ.. భార్యే హత్య చేసింది
గురువారం హయత్‌నగర్‌లో 19.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా పటాన్‌చెరు, రాజేంద్రనగర్‌లో 20 డిగ్రీలు, హకీంపేటలో 19.3, బేగంపేట(Begumpet)లో 20.2, దుండిగల్‌లో 20.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే పటాన్‌చెరులో 7.5 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 8.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.
రోజంతా కురిసిన ముసురు, చిరు జల్లులతో ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్(Khairatabad, Panjagutta, Lakdikapool), సనత్‌నగర్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్. కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ, మాదాపూర్, కొండాపూర్(Madhapur, Kondapur) ప్రాంతాల్లో కురిసిన జల్లులతో ట్రాఫిక్‌జాం సమస్యలు తలెత్తి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గ్రేటర్‌లో మరో రెండురోజుల (శుక్ర, శనివారం) పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముంటుందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
ఈవార్తను కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో 600పీవో పోస్టులకు నోటిఫికేషన్
ఈవార్తను కూడా చదవండి: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..
ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..
Read Latest Telangana News and National News